సింహాచలంలో మజ్జిగ పంపిణీ చేసిన కీర్తి

 తాను స్థాపించిన శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందలాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత పది రోజులుగా సొంత ఖర్చులతో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఆ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.కీర్తి పట్నాయక్. సింహాచలం దేవస్థానంలో పూజా సామాగ్రి అమ్ముకునే వార్కి, నిరాశ్రయులకు, భక్తులకు, తొలిపావంచా తదితర ప్రాంతాల్లో భక్తులకు రోజంతా తన సొంత ఖర్చులతో మజ్జిగ పంపిణీ చేస్తూ వేసవి తాపం నుండి కాస్తా ఊరట కలిగించే కృషి చేస్తున్నారు కీర్తి పట్నాయక్.
ఈ సందర్భంగా కీర్తి పట్నాయక్ మాట్లాడుతూ 
సూర్యుని భగభగలతో ఉదయం ఎనిమిది గంటల నుండే  విపరీతమైన వేడివలన జనం బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గతం కంటే నేడు చాల ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయని, సాయంత్రం ఐదు గంటల వరకు వీలైనంత బయటకు వెళ్లకపోవడమే మంచిదని అన్నారు. రోజుకి కనీసం 4 లీటర్ల నీరు తాగాలని,  సగ్గుబియ్యం జావ, బార్లి, పల్చని మజ్జిగ,  కోబ్బరిబొండాలు తాగాలని, శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయాలు, ఆహారం మాత్రమే తీసుకోవాలని,  కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ వలన ప్రయోజనాలు వుండవని హెచ్చరించారు. 
డీ హైడ్రెషన్ నుండి బయటపడేందుకై పెరుగు చాలా దోహదపడుతుందని, పెరుగు అన్నం తినడం చాల మంచిదని, ఒంట్లో వేడిని తగ్గించేటి మజ్జిగ తాగడం మంచిదని ఆమె అన్నారు.  పెరుగన్నం ఎలక్ట్రో లైటులు,  డీహైడ్రెషన్ నుండి కాపాడుతుందని అన్నారు. జాగ్రత్తలు పాటించని ఎడల శరీరంలో వేడి పెరిగి, గుండె వేగంగా కొట్టుకోవడం మొదలౌతుందని కీర్తి పట్నాయక్ తెలిపారు.  బయటకు వెళ్లినప్పుడు గొడుగు  వేసుకుని వెళ్లడం చాల మంచిదని, నూలు వస్త్రం  ముఖానికి కట్టుకోవాలని అన్నారు. 
పండ్ల రసాలు, పుచ్చకాయ ముక్కలు తరచు తీసుకోవాలని ఎందుకంటే, పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ వుంటుందని,  వాటి వల్ల డీహైడ్రెషన్ కి గురి కాకుండ వుంటారని పాదచారులందరికీ వివరించారు.
తాటి ముంజెలు తినడం వలన  శరీరానికి చల్లదనం వస్తుందని, వాటిలో కూడ నీటి శాతం అధికంగా వుంటుందనీ,
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తాయని కీర్తి పట్నాయక్ అన్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తలు అవసరమని, ఈ ఎండలకు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం వుందని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, ఎక్కువ శారీరక శ్రమ చేసినవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ వడదెబ్బకు గురి కాకుండా ఈ జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
వడదెబ్బ లక్షణాలైన 
కండరాల తిమిరెక్కటం,  
భారీగా చెమటలు పట్టడం, విపరీతమైన బలహీనత,  తలనొప్పి, వాంతులు రావడం చిరాకుగా వుండటం వంటి లక్షణాలను బట్టి వెనువెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.టి.ఎల్. పూర్వ అధికారి టి.వి.చారి, దేవస్థానం సి.సి. శ్రీహరి రాజ్, ఆలయ సేవకులు వెంకటలక్ష్మి, లీల, లక్ష్మి, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. 
కీర్తి పట్నాయక్ గావిస్తున్న  స్వచ్చంద సేవలను కొనియాడుతూ ఆమెను అభినందించారు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం