వింతలు విశేషాలు! సేకరణ... అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆద్వీపాలు కొన్నాళ్ళు కన్పడి ఆపై చటుక్కున మాయమైపోతాయి.అవే అరోరా ఐలాండ్స్.18 వశతాబ్దిలో దక్షిణ అట్లాంటిక్ సముద్రం లో వెల్తున్న నావికులు 3చిన్న ద్వీపాలు చూశారు.వాటికి ఆతొలి ఓడపేరు అరోరా అని ఆపేరుతోటే పిల్చారు.1794 లో ఒక స్పానిష్ షిప్ వాటిని చూసి ంది.తమాషా ఏమంటే స్పెయిన్ ఓడలు సౌత్ అమెరికా వెళ్లేప్పుడు ఆమూడు ద్వీపాలు కన్పడి హఠాత్తుగా మాయమయ్యేవి.అవి భూకంపాలు వచ్చే చోట అవి ఉంటే ఇలా ద్వీపాలు ఏర్పడి మాయం కావటం సహజం. ఇస్లాగ్రాండే ద్వీపం అలా ఏర్పడి ఆపై చలీచప్పుడు  లేకుండా మాయమైంది.
రక్తం రంగు ఎరుపు అని మనకు తెలుసు.కానీ నీలి చర్మం జనం ఉన్నారు అంటే నమ్మకం కలగదు.చిలీలో ఎత్తైన కొండలపై ఉండేవారి చర్మం నీలంగా ఉంటుంది.దానికి కారణం వారు సముద్ర మట్టానికి 6 100మీటర్ల ఎత్తులో ఉండటమే సుమా! ఆక్సిజన్ సరఫరా సరిగా అందక చర్మం నీలంగా మారుతుంది.వంశపారంపర్యంగా నీలి రంగు చర్మం వస్తుంది. 🌹
కామెంట్‌లు