జానకమ్మ- చంద్రకళ యలమర్తి
తిశ్రగతిలో 
-----------
*---*
(ఈ గజల్ ఒక సంక్షిప్త రామాయణము;-)
జనకునింట గారముగా
పెరిగెనమ్మ జానకమ్మ
మట్టిలోన మాణిక్యమై 
దొరకెనమ్మ జానకమ్మ

శివధనుసును విరిచిరాగ 
రఘురాముని మనువాడెను 
రామయ్యను మనసారా 
వలచెనమ్మ   జానకమ్మ

తండ్రి మాట పాటించిన 
పతివెంటను నడచెనామె 
కాలినడకన కానలకు 
 వెడలెనమ్మ జానకమ్మ

అడవిలో ఆనందముగ
కందమూలములనెతినెను       
బంగారుగ మెరయుజింకను 
కోరెనమ్మ  జానకమ్మ

రావణమాయతెలియకనె 
లక్ష్మణరేఖ దాటెనామె 
అశోకవటి హనుమరాగ 
మురిసెనమ్మ జానకమ్మ

నిండుచూలాలు సీతను 
మరలఅడవిలోవిడచిరి 
వాల్మీకి మునిఇంటనే 
చేరెనమ్మ జానకమ్మ

లవకుశులకు జన్మనిచ్చి 
ఆశ్రమమున సేదతీరె 
బిడ్డలమురిపాల, బాధలు                 
   మరచె నమ్మ జానకమ్మ
**



కామెంట్‌లు