ఐన్స్టీన్ మేడం క్యూరీల ప్రశంసలు అందుకున్న ఘనుడు! ‌అచ్యుతుని రాజ్యశ్రీ

 ఏడుగురు చెల్లెళ్ళున్న అన్న ఆకుర్రాడు తల్లి మరణించినా తండ్రి క్రమశిక్షణలో పెరిగాడు.4వక్లాస్ విద్యార్థి గా చాకు లాంటి కుర్రాడు అని అందరి ప్రశంసలు పొందారు.లెక్కల్లో 100కి 110మార్కులు పొంది కొత్త రికార్డు నెలకొల్పారు.1939 లోనే తల్లి కన్నుమూస్తే ఆపిల్లాడు బాధ్యత బరువులు మోసి
సైన్స్ పరికరాలు తయారు చేసేవారు.20వ ఏటనే పెళ్లయింది.ఎం.ఎస్సీ లో కూడా ఫస్ట్ రాంక్!ఢాకా
యూనివర్సిటీ లో ఫిజిక్స్ రీడర్ గా ఆంగ్లంలో 6పేజీల వ్యాసం ( ఫిజిక్స్) రాసి ఐన్ స్టీన్ కి పంపడం ఆయన
దాన్ని జర్మన్ భాషలోకి అనువాదం చేసి ప్రచురణ కి పంపడంతో మన శాస్త్రవేత్త సత్తా ప్రపంచం తెల్సుకుంది." మీకు డాక్టరేట్ డిగ్రీ సిఫార్సు అనవసరం" అని ఐన్ స్టీన్ ప్రశంసించారు.25 ఏళ్ళు ఢాకా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా  ఆపై విశ్వభారతికి వి.సి.గా పనిచేశారు.
2మాథమెటికల్ ఫిజిక్స్ లో మేథావి.కృత్రిమ ఎరువుల తయారీ గులాబీ పూలతో పరిమళ ద్రవ్యాలు ఆయన పరిశోధన కి నిదర్శనం.సభలో నిద్రలో జోగుతూ ఉన్నట్లు కన్పించేవారు.నీల్స్ బోర్ అనేవక్త బోర్డు మీద రాస్తూ ఒక సైన్స్ ఫార్ములా మర్చిపోతే ఠక్కున కళ్ళు విప్పి చకచకా బోర్డు పైన రాసి వివరించారు.అంతే! ఆయన నిద్ర పోతున్నారని
అనుకున్న ప్రేక్షకులు డంగైపోయారు.పుస్తక పఠనం
పిల్లితో ఆడుకోవడం ఆయన హాబీలు.మేడం క్యూరీతో ఫ్రెంచ్ భాషలో మాట్లాడేవారు.సంగీతంలోనైపుణ్యం సరికొత్త రాగాలకు స్వరకల్పన చేసిన దిట్ట.బెంగాలీ వాద్యం
ఎస్రాజ్ ను హాయిగా వాయించేవారు.కల్కత్తా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పి.జి.వారికి ఫిజిక్స్ ని
బెంగాలీ భాషలో బోధించారంటే నమ్మబుద్ధి కాదు గదూ!? అర్థం కాని విషయం తెల్సుకోటం కోసం విద్యార్థులు ఆయన ఇంటికి వెళ్ళితే ఎంత అలసి డస్సిపోయినా తిరిగి బోధించేవారు.పరీక్షవాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తాంఅన్న విద్యార్థులతో
" నేను జాబ్ కి రాజీనామా చేస్తాకానీ మీ డిమాండ్ కి తల ఒగ్గను" అనటంతో  ఆయన లాంటి ప్రొఫెసర్ దొరకడం కష్టం అని గ్రహించి వారు జీహుజూర్ అనక తప్పలేదు.
3 అశుతోష్ ముఖర్జీ ఎం.ఎస్సీ.పరీక్షపేపర్లో ఒకే ప్రశ్న మూడేళ్ళు వరుసగా ఇచ్చారు." మీరు ఇచ్చిన ప్రాబ్లం తప్పు.విద్యార్ధులు ఏంరాయగలరు?" అని మీటింగ్ లో నిలదీశారు.మిగతా ప్రొఫెసర్లు అంతా భయపడ్డారు.కానీ అశుతోష్ తన తప్పు తెలుసుకొని అభినందించారు.ఇదీ ఆనాటి వారి గొప్పతనం.మనమైతే మూతి ముడుచుకుని శాపనార్థాలు పెడతాం.ఆయన జీవిత చరిత్ర రాద్దామని ఓజర్నలిస్ట్ వెళ్లితే" నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు?" అని సున్నితంగా తిరస్కరించారు.1974 ఫిబ్రవరి 4న భార్య ఇద్దరు కొడుకులు ఐదుగురు కుమార్తెలను వదిలి కన్నుమూసిన ఈమహాశాస్త్రవేత్త సదా వందనీయుడు..
4 ఐన్ స్టీన్ మేడం క్యూరీల ప్రశంశలు పొందిన
ఆయన సత్యేంద్రనాథ్ బోస్.తండ్రి సురేంద్ర నాథ్ రైల్వే ఉద్యోగి.తల్లి ఆమోదిని.పద్మవిభూషణ్  బోస్1952 లో రాజ్యసభ సభ్యుడు గా ఉన్నారు.
కామెంట్‌లు