భళా భళీ;- -గుండాల నరేంద్ర బాబు
 అచ్చమైన తెలుగు భాషరా 
మచ్చలేని మంచి భాషరా 
తూర్పుచాళుక్య రాజురా 
రాజ రాజ నరేంద్రుడురా 
సంస్కృత భారతాన్నిరా
తెలుగులో రాయమనెరా 
ఆదికవి నన్నయ భట్టురా 
ఆది సభా అరణ్య పర్వ
శేషం రాసి మరణించెరా
కవిబ్రహ్మ తిక్కనరా 
పదునైదు పర్వాలురా 
అచ్చ తెలుగున రాసెరా
ప్రబంధ పరమేశ్వరుడురా
అరణ్య పర్వశేషమురా
అద్భుతంగ పూరించెరా 
కవిత్రయo కలమందురా
మహా భారతమ్మేరా
జయ కావ్యమై వెలసెరా
ఆంధ్రులందరి చేతరా
భళా భళీ అనిపించెరా 
 =======================
 గుండాల నరేంద్రబాబు 
తెలుగు సాహిత్య పరిశోధకులు  
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
తేది 09-04-2024, సెల్ :9493235992
కామెంట్‌లు