సుప్రభాత కవిత ; - బృంద
పొడిచే పొద్దున తూరుపుగా
పులిమే రంగులు ఎరుపుగా
కలిమిగ దొరికే వరముగా
విరిసే వెలుగుల పువ్వుగా!

కాలపు నడకల వైనంలో
మాయాజాలపు బందీలో
నడిచే మోహపు బ్రతుకులో
గడిచే  భారపు నిమిషాలు

ఆగని ఆశల పరుగులలో
ఊగే ఊహల ఊయలలు
సాగే జీవన యాత్రలలో
రేగే కలతల జాతరలు

అంతరంగాన అలజడి రేపే
దిక్కులు తోచని బంధాలు
చుక్కానికై వేసారిన చూపుల
నిండిన ఆశయాల వెలుగులు

రెప్పల తడిపే నిస్సహాయతలో
గొప్పగ తోచే భవితకై
జట్టుగ ఉండే సాయంలా
చేయందించే వేకువకు

🌸🌸సుప్రభాతం 🌸🌸

 
కామెంట్‌లు