న్యాయాలు-466
కైదారికా న్యాయము
****
కైదారికము అనగా కేదారముల (వరిమళ్ల) సమూహము.
వ్యవసాయ దారుడు నీటి కాలువలో నుండి ఒక పొలమునకు నీరు పెట్టి,ఆ తూము మూసి వేసి,మరో చోట తూము చేసి మరొక పొలమునకు నీరు పారించుట.
ఇలా ఎక్కడ ఏ అవసరమో చూసుకుని అన్నింటికీ సమ పాళ్లలో న్యాయము చేయడాన్ని మన పెద్దలు ఈ "కైదారికా న్యాయము"తో పోల్చి చెబుతుంటారు.
ప్రతి పనికి ఓ లెక్కా, పద్ధతి వుంటాయి అంటారు మన పెద్దలు. మరి దానికి పెద్ద చదువులు, డిగ్రీలు కావాల్సి వుంటుందా? అంటే కొన్నింటికి అవసరం లేదనే చెప్పాలి .
వ్యవసాయ దారుడికి చదువుతో పరిచయం ఉన్నా లేకపోయినా వ్యవసాయంలో అన్ని మెళకువలు తెలిసి వుంటాయి. ఎప్పుడు ఏం చేయాలో అవగాహన వుంటుంది.
తొలకరి జల్లులు కురిసే టప్ఫటికి వ్యవసాయం కోసం ఎంచుకున్న భూమిని పలుమార్లు దున్నడం, సంవత్సరం అంతా పోగేసిన సేంద్రియ ఎరువులను పొలాల్లో చల్లి దుక్కి చేసి చదును చేయడం మొదలైనవి అన్నీ తమకు తామే ప్రతి రైతూ చేస్తూ వుంటాడు.
పొలాలను గట్లతో మడులుగా విభజించుకుని నారు పోసిన తర్వాత ప్రతి భాగంలో కాలువలో నీటితోనో ,బావిలో నీటితోనో,బోరుపంపుల నీటితోనో పొలాలకు పసిబిడ్డకు పాలు పట్టినంత జాగ్రత్తగా నీళ్ళు పడుతుంటారు.
ఒక్కో మడిలో నీళ్ళు అధికం కాకుండా, తక్కువ కాకుండా పట్టి అనంతరం ఆ తూము లేదా దారిని మూసి మరో మడికి నీరు అందేలా చేస్తారు.ఇలా అన్ని మడులకు సమ పాళ్లలో నీళ్ళు అందేలా చేస్తుంటారు.
అలా పంట నారు వేసినప్పటి నుండి పంట ధాన్యం చేతికి వచ్చేంత వరకూ నీటి సరఫరా ఎప్పుడు చేయాలో చేయకూడదో ప్రతి రైతుకూ తెలిసి వుంటుంది.
ఇందులో విశేషం, గొప్పతనం ఏముంది? రైతన్నాక ఈ మాత్రం తెలియాలి కదా! దీనిని ఓ న్యాయంగా చెప్పాలా? అనిపించడం సహజం.
కానీ మన పెద్దలు ఏది చెప్పినా దానిని తప్పకుండా జీవితానికి అన్వయించి చెప్పడం విశేషం.అదే వారి సూక్ష్మమైన పరిశీలనా శక్తికి ప్రత్యక్ష నిదర్శనం.
ఇక్కడ ఇంటి యజమానిని వ్యవసాయదారుడిగానూ, కుటుంబ సభ్యులు అంతా కుటుంబ పొలంలోని మడుల లాంటి వారుగా చెప్పుకోవచ్చు.
వాళ్ళందరినీ నిశితంగా పరిశీలించి ఎవరికి ఏమి అవసరం?ఎంత అవసరం? అనేది గుర్తెరిగి ఆప్యాయతానురాగాల ఎరువు వేసి,ప్రేమ అనే నీటిని పారించి,అన్ని పంట మడులకు ఎలాంటి లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకుని కుటుంబ యజమానులు మమకారపు పంట పండించాలనే అర్థంతో ఈ "కైదారికా న్యాయము"ను సృష్టించారు.
అదండీ! ఈ న్యాయము లోని అసలైన అంతరార్థం.దీనిలో ఇంటి యజమానికి చదువుతో సంబంధం లేదు కానీ చదువును మించిన విజ్ఞత, వివేకం, సమయస్ఫూర్తి, చాకచక్యం,లౌక్యం వీటన్నింటితో పాటు కుటుంబ సభ్యులందరి గౌరవాభిమానాలు పొందగలగాలి.
అప్పుడే ఆత్మీయమైన నమ్మకపు పునాదులతో వేసుకున్న పంటంతా మూడు పువ్వులు ఆరు కాయలు లాంటి మంచితనపు ,మమకారపు దిగుబడి వస్తుంది. వ్యవసాయ దారునిలా కరువులను కాటకాల్లాంటి రకరకాల సమస్యలు, ఆటంకాలను ఎదుర్కొనే శక్తి కూడా సమకూరుతుంది.
నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు, నేటి వ్యక్తులే రేపటి కుటుంబ యజమానులు అనేది సదా గమనంలో పెట్టుకొని మన కుటుంబ కేదారములను కంటి రెప్పలా కాపాడుకుందాం. మరి మీరేమంటారు?
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి