బాలగేయం;- మిట్టపల్లిపరశురాములు
భలెభలెబాలలు              
బంతిపూలమాలలు 
పిల్లగాలివీయగ
చల్లగాలివేయగ
                                                  
గలగలపారేసెలయేరు
 ఊహలఊయలఊగారు     \
*కొమ్మనుపట్టుకఆటలు
కమ్మని కోయిల పాటలు
 
దరువులువేయగబాలలు. 
చెరువునవీచేగాలులు         
పల్లెలోఉన్నవిపచ్చనిపైరులు 
పరిమళమల్లెలువిరబూయ 
  
రామచిలకమధురపలుకులు
కొమ్మలొకోయిలగేయములు
మువ్వలుఘల్లునమోగంగా
గువ్వలుగుంపుగనాడంగా. 

బాలలుకిలకిల నవ్వంగా
 హాయిగాపొంగెనుగంగమ్మ
తెల్లనినురుగులుపొంగంగ
జలములుచెరువుననిండంగా.
కలసిమెలసికదిలారు.
సరసునసరసాలాడారు.
సరగున ఈతలుకొట్టారు.                 
 పరుగునఇంటికితరిలారు
  *.     *.   *                  
కామెంట్‌లు