కొరాడ నానీలు:- * త్యాగం *

 పోరాడి ,సాధించాడు
  స్వార్ధ0పై విజయం! 
   భలా ...కాగలిగాడు... 
   గొప్ప త్యాగి గా...!! 
     ******
అతడి బుద్ది
  త్యాగివై సేవ చెయ్యమంటె
  మనసు.... 
  అడ్డు తగులు తోంది..! 
      *****
  ఆమె సుఖం కోసం
  తన ప్రేమను
  త్యాగం చేసేసాడు
   నిజమైన ప్రేమికుడు! 
     ******
కని, కష్టా లెన్నో ఓర్చి
  పెంచి, పెద్ద చేసె... 
 అమ్మకంటే... 
 త్యాగ శీలు రెవరు..!? 
     *******
 తన సుఖమే ... 
  స్వార్ధ పరుదు...! 
   పరులకోసమే బ్రతి కాడు
  త్యాగ ధనడు...!! 
      *******
నేను  నుండి నావాళ్లు
  మనము... మనదేశ0
  వీళ్లు  నిజమైన.. 
  త్యాగ శీలురు ...!! 
    *******
కామెంట్‌లు