కదంబం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 శ్రీరామచంద్రమూర్తి  శ్రీ అంటే సిరి లక్ష్మి  వెలుగులను నింపేది  రామ అంటే  అంకిత భావంతో ధర్మరక్షణకు పూనుకున్న వ్యక్తి  చంద్ర అంటే చంద్రుడు  చల్లటి వేడుకలు ఇస్తూ  తన  చల్లని చూపులతో ప్రజలకు ఆనందాన్ని కలుగ చేసేవాడు  మూర్తి అంటే ఓ బొమ్మకు  ప్రాణం పోసి  దానిని సజీవం  చేయడం  అలాంటి విష్ణు స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తి సీతతో కలిసి  జీవితాన్ని ఆదర్శప్రాయంగా  ధర్మ రక్షణ కోసమే జీవించిన వారు కనుక ప్రతి సంవత్సరం వారి వివాహం ప్రతి గ్రామాల్లో ప్రతి రామాలయంలో జరుగుతూ ఉంటుంది  ఇన్ని యుగాలు గడిచినా  మానవుడు మానవుడిగా జీవించాలి ఎలా జీవించాలో   తెలియచేసిన ఆదర్శమూర్తి కనక  దాంపత్య జీవితం ఎలా ఉండాలో కష్టాల్లో నష్టాల్లో ఎలా ఒకరికొకరు సహకరించుకోవాలో చెప్పారు కనుక  శాశ్వతంగా మానవ హృదయాలలో నిలిచి ఉండడం సహజం.
దీనిని   శాస్త్రీయంగా ఎలా చేయాలో  జ్ఞానులు మనకు తెలియజేశారు  వేసవికాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది  దానికి ప్రత్యామ్నాయం  ఉండాలి కనుక  శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేది  పెసరపప్పులో బెల్లాన్ని కలిపి  ఇవ్వడం  మంచినీటిలో బెల్లాన్ని మిరియాలు లాంటి పదార్థాలు వేసి  తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది  అయితే ఇది శ్రీరామనవమి ఒక్కరోజు మాత్రమే ఉండాలా  40 రోజులు ఉన్న ఈ తాపాన్ని తగ్గించుకోవడానికి ఈ రెండు పదార్థాలు మనకు ఉపయోగపడతాయని  శాస్త్రజ్ఞులు తెలియజేసిన విషయం  దానిని పాటించినట్లయితే  ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా శరీరానికి ఏమీ కాదు అని చెప్తారు  మాట్లాడాను మనం జాగర్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఏర్పాటు శరీరమాధ్యం కలు ధర్మసాధనం  శరీరం లేకుండా ఏ పని చేయలేం  దేహం లోపల ఉన్న జీవి ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది అని అనుకుంటాం కానీ ఈ దేహం ఆరోగ్యంగా లేకపోయినట్లయితే ఆ జీవి ఏం చేస్తుంది  అసహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది  తిరిగి ఆరోగ్యం వచ్చేంతవరకు దాని పని శూన్యం  కనుక ప్రతి ఒక్కరూ దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యంగా  ఉండడం కోసం తగిన ఆహారాన్ని తీసుకోవడం  తాను ఎంత తినగలడో అంటే మాత్రమే స్వీకరించండి అంతే తప్ప ఏదో ఒక కూర బాగుందని మరొక కారణంతో ఎక్కువ తింటే  అది శరీరాన్ని కృంగదీస్తోంది  అది జీర్ణమయ్యే అంతవరకు  శరీరం కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటుంది  దానికోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే వ్యాయామం తప్పకుండా చేసి తీరాలి  లేకుంటే ఇబ్బంది పడక తప్పదు.





కామెంట్‌లు