శాంతి ;- మేకల అనురాధ ప్రసాద్ మహబూబ్ నగర్ విశ్రాంత ఉపాధ్యాయిని చరవాణి నంబర్ 9177114243
 తమ గోడును అందరికి 
వినిపిస్తూ ఉంటారు 
వర్తమానంలో దక్కిన
 ఆనందాన్ని అనుభూతి
 చెందలేరు కొందరు 
 మరికొందరు ముఖంలో 
 చిరునవ్వు చెదరనివ్వరు 
ఇది ఒక కళ వారి 
వెనకాల గూడు కట్టుకొని 
ఉన్న బాధ ఆశ్చర్యం 
కలిగించు శాంతికి 
 పర్యాయపదం బుద్ధుడి చిరునవ్వు
 రాఖీ కట్టిన చెల్లి  
కట్టించుకున్న అన్న
 ముఖాలలోని ఆనందం
వర్ణనాతీతం రెండు కళ్ళు
 చాలవు తిక్కన రెండు 
రకాలనవులను
 ఉదాహరించారు
 కృతకంగా కనిపించే 
  పొడి  నవ్వుల కన్నా 
పెదాలపై జీవం పోసుకునే
 నవ్వులే మానవ సంబంధాలను 

గట్టిపరుచు వాటిలో స్వర్గమావ 
రించుకొని ఉండు
కామెంట్‌లు