కన్నవారు-మిన్న వారు;- -గద్వాల సోమన్న,9966414580
కన్నవారి ప్రేమలోన
వెన్నముద్దలున్నవి
వారు చేయు సేవలోన
త్యాగాలెన్నో ఉన్నవి

బుద్ధి చెప్పు మాటలోన
దిద్దుబాటు ఉన్నది
గద్దింపు ధోరణిలోన
వృద్ధి ఎంతో ఉన్నది

కన్నవారు ఇంటిలోన
ఉంటేనే అందము
వారి చల్లని నీడలోన
జీవితాలు పదిలము

కన్నవారు జగతిలోన
చూడగ ఇలవేల్పులు
వారి అవసాన దశలోన
ఆదరిస్తే దీవెనలు


కామెంట్‌లు