ఆవేదన-నివేదన;- -గద్వాల సోమన్న,9966414580
కాలువ గట్టున బాలుడు
వేణువు పట్టి ఊదుడు
గలగల పారే నీరు
తలపించుచున్నది యేరు

పచ్చిక మేసే ఆవులు
ఆలకిస్తున్నవి చెవులు
ఏపుగా ఎదిన తరువులు
ఒలకిస్తున్నవి సొగసులు

ఎంత అందమో ప్రకృతి
మనసులు దోచే ఆకృతి
చుట్టూ నీలి మేఘాలు
నింగిని తాకే వృక్షాలు

కన్నులు రెండు చాలవు
ఊహకు అసలే అందవు
భలే భలే అందాలు
ప్రకృతి సజీవ సాక్ష్యాలు

ప్రకృతి ఒడిలో ఆనందము
దొరుకుతుంది ఆరోగ్యము
మనసుకెంతో ఆహ్లాదము
పంచిపెట్టును వినోదము

పచ్చదనమును చెరపకండి!
ఎడారిలా మార్చకండి!
మానవ మనుగడకు ముప్పు
తెచ్చి తప్పు చేయకండి!


కామెంట్‌లు