అక్షరాల ఆవేదన;- -గద్వాల సోమన్న,9966414580
పచ్చని చెట్లు నరికివేత
పుడమి తల్లికి గుండెకోత
నరికి నరికి వృక్షజాలమును
తెచ్చిపెట్టకు ఊచకోత

ప్రాణ వాయువులను పంచే
ఆయురారోగ్యాలను పెంచే
పరోపకారులు వృక్ష జాతిని
నరకవేయకండి ఈ రీతిని

చెడు వాయువులు పీల్చుకుని
స్వచ్ఛ వాయువులు పంచుకుని
క్షమతో ఉపకరించు వ్యధ 
తన గుండెలోన దాచుకుని

మేలుకు ప్రతిగా  కీడుచేయుట
కృతఘ్నత భావం చూపించుట
ఇకనైనా మానవా! మానవా!!
మానవత్వంతో  మసలవా!


కామెంట్‌లు