సుప్రభాత కవిత ; -బృంద
భారంగా గడిచిన రేయికి
దూరంగా పొడిచిన పొద్దు
అంబరాన వేగంగా కదులుతూ 
వెలుగుల బంతి పయనం

నీటి వాలున అలల  కదలికలు
ఏటి హోరున అమరిన సరిగమలు
తేటి పాటలో చిందే మధురిమలు
కోటి ఆశలు వేసెను మొలకలు

బంగరు వెలుగుల జిలుగులలో
పొంగెడు సొగసుల మిలమిలతో
నిండుగ సాగే సెలయేరు
పండుగ కాదా కన్నులకు?

ప్రతి క్షణం కొత్తగ తోచే అందాలు
ప్రతి మదినీ కదిలించే  భావనలు
ప్రతి దినమొక మంచి అవకాశం
ప్రతి జీవికీ పంచే ప్రభాతం...

ఊహలకు ఊతంగా
ఆశలకు ఆధారంగా
కలలకు సాకారంగా
కలిసొచ్చే ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు