కల్మష రహిత మైన మనస్సు- సి.హెచ్.ప్రతాప్

 భగవంతుడు ఈ సృష్టి నిర్మాత. ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి ప్రభువు. ఆయన సృష్టించిన ఈ మనుషుల్లో కులతత్వపు అడ్డుగోడలెందుకు? ప్రతి మనిషికి సమానమైన హక్కులు భగవంతుడు కల్పించాడు. ప్రతిఒక్కరు తమ కర్తవ్యాన్ని పవిత్రంగా, నిష్కల్మష హృదయంతో, నిస్వార్ధ భక్తితో నిర్వర్తించాలి.  మనస్సు, ఆత్మ నిర్మలంగా ఉన్నప్పుడూ మన ఇంటి తొట్టిలోని నీళ్ళు కూడా గంగా జలంతో సమానం అంటారు సుప్రసిద్ధ తత్వవేత్త సంత్‌ ‌రవిదాసు.నిజానికి మానవుడి సహజ స్వభావం ఆనందమే. మనస్సు ఎల్లప్పుడూ మానససరోవరంలా వుంటుంది కానీ దాన్ని మరచి బాహ్య భావనల ప్రభావానికి లోనై,  నిత్యశోకితుడై జీవితాన్ని నిరర్థకం చేసుకుంటున్నాడు.సత్యాన్వేషణ యాత్రలో ముందుగా ‘అంతరంగం’ శుద్ధి కావాలి. అంతరంగమంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాల కలయిక. మనసు మాలిన్యం పోగొట్టాలంటే మనసుకు మూలమైన ఆలోచన, సంకల్పం సక్రమంగా ఉండాలి.మనస్సును అదుపులో ఉంచుకోవాలి. ఆలోచించడం మరియు ఆలోచించకపోవడం మీ ఇష్టానుసారం నిర్వహించబడాలి. అప్పుడే అది మన నియంత్రణలో ఉందని, మన స్పృహకు మనమే యజమానులమని చెప్పుకోవచ్చు.మనలో ద్వేషమే పెంపొందించుకుంటే, మన నకారాత్మక ఆలోచనలు, మనం ద్వేషించే వస్తువుకి కాకుండా, మనకే ఎక్కువ నష్టం కలుగ చేస్తాయి. చాలా మంది సాధకులు తమ యొక్క నియంత్రణలేని మనస్సే తమకు ఎంతో హాని కలుగచేస్తోందని తెలుసుకోరు.ఉద్రేకపూరితమైన, చంచలమైన, ఉద్రేకపూరితమైన మనస్సు. సరైన ఏకాగ్రత లేకుండా, ఏ మనస్సు సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండదు. విక్షేపాన్ని తొలగించాలంటే భక్తి కావాలి. నచ్చిన దేవత పట్ల ఉపాసన మరియు భక్తి చిత్తశుద్ధితో  చేయడం మనస్సును పవిత్రపరచుకునేందుకు ఒక చక్కని మార్గం. బుద్ధి చేతనే మనస్సు నియంత్రణలోకి రావడం సాధ్యం. భగవంతుని యందు సం పూర్ణ శరణాగతితో మానవుడు తన బుద్ధితో మనస్సును ఆయన యందు నిష్కల్మషమైన భక్తి భావన యందు నిలిపితే మనస్సు అప్రయత్నంగానే దృఢవంతమౌతుంది.
కామెంట్‌లు