శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
751)త్రిలోక థ్రుక్ -

ముల్లోకాలకు ఆధారమైనవాడు 
భువనములకు గురుతుల్యుడు 
త్రిలోకములకు మార్గదర్శకుడు 
విశ్వముకు ప్రధానమైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
752)సుమేధాః -

చక్కని ప్రజ్ఞ కలిగినవాడు 
జ్ఞానవంతుడై వెలుగువాడు 
మేధస్సుతో నిండినవాడు 
జ్ఞానప్రకాశము కలిగినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
753)వేధజః -

యాగమునుండి పుట్టినవాడు 
హవిస్సులతో నిండుచున్నవాడు 
వేదములు జనించునట్టివాడు 
రుత్విక్కులలో నుండినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
754)ధన్యః -

కృతార్థుడై యున్నట్టివాడు 
భక్త జనులతో ధన్యుడైనవాడు 
దివ్యత్వముతో భాసించువాడు 
క్షేత్రముల వెలసినట్టి ధన్యుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
755)సత్య మేధః -

సత్య జ్ఞానము కలిగినవాడు 
నిజమేధస్సు రూపంలోనివాడు 
సత్యలక్షణములున్నట్టి వాడు 
వేదవిజ్ఞానము తెలిసినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు