శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
721)అనేక మూర్తిః -

వివిధ మూర్తులలో యున్నవాడు 
అనేకరూపాలు దాల్చగలవాడు 
అవతారములు దాల్చినవాడు 
పలుమూర్తులుగా నిలిచినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
722)అవ్యక్తః -

అగోచరము అయినట్టి వాడు 
వ్యక్తముకాని విధమైనవాడు 
ఇదియని నిర్ణయించలేనివాడు 
అర్థము చేసుకోలేనట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా
723) శతమూర్తిః -

వందమూర్తులను దాల్చినట్టివాడు 
వివిధ అవతారములున్నవాడు 
కార్యములకు రూపుదాల్చినవాడు 
శతమూర్తిమత్వము యున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
724)శతాననః -

అనంత ముఖములున్నవాడు 
అన్నివైపుల చూచుచున్నవాడు 
నలుదిక్కులు వ్యాపించినవాడు 
శతాననుడై వెలసినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
725)ఏకః -

ఒక్కడే అయివుండినవాడు 
సర్వులు తానే అయినవాడు 
విశ్వాత్మతాను అయినట్టివాడు 
ఏకరూపంలో గోచరించువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు