ఓటు హక్కును వినియోగించుకుందాం; - డా. తెలుగు తిరుమలేష్
 ఓటు హక్కును వినియోగించుకుందాం;
వంద శాతం ఓటింగ్ కోసం కృషి చేద్దాం
-రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు,ప్రొఫెసర్ జయశంకర్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు తిరుమలేష్ 
     ఓటు మనకు రాజ్యాంగం కల్పించిన మన హక్కు, మన ఆయుధం.మన ఓటు మన అభివృద్ధి అనే నినాదంతో ప్రతి ఒక్కరు తమ ఓటును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలి.ఓటు హక్కును అందరం విధిగా వినియోగించుకుందాం అని వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, రెడ్ క్రాస్ జిల్లా సభ్యులు,ప్రముఖ కవి,రచయిత,సామాజిక సేవకులు తెలుగు తిరుమలేష్ అన్నారు. ఓటరే ప్రజాస్వామ్యం బలమైన ఆయుధం.బాధ్యత గల పౌరునిగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని పటిష్ట పరచాలని రెడ్‌క్రాస్‌ జిల్లా సభ్యులు తెలుగు తిరుమలేష్ గారు  పేర్కొన్నారు
       
      ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు శక్తివంతమైన హక్కు ఇవ్వబడింది.ఓటర్ చైతన్యం కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలి,ఐదేళ్లకొకమారు వచ్చే ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత కలవని, ఓటు విలువ అందరు తెలుసుకోవాలని, ఓటును మద్యానికో, డబ్బుకో మరో దానికో అమ్ముకోకూడదని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రజుల ఓటు హక్కు వినియోగంలో నిర్లిప్త కలిగి ఉంటున్నారని, ఇటువంటి ధోరణి అసలైన ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని వారు అన్నారు
.
       ఓటు హక్కును వినియోగించుకుందాం తద్వారా ప్రజాసామాన్ని కాపాడుదాం నినాదంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగిం చుకోవాలని, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అన్నారు. మే 13న నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నిక లలో 100 శాతం ఓటింగ్ నమోదుకు ప్రతి ఒక్కరు కృ షి చేయాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని వారు అన్నారు.

కామెంట్‌లు