శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
756)ధరా ధరః -

భూమిని ధరించియున్నవాడు 
ధరణిని కాచుచుండిన వాడు 
సర్వప్రాణులను రక్షించువాడు 
భూదేవికి పతియైనట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
757)తేజో వృషః -

సూర్యతేజమున్నట్టి వాడు 
కిరణములచే వర్షించువాడు 
మేఘకారణముగా నున్నవాడు 
తేజో వృషుడైనట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
758)ద్యుతి ధరః -

కాంతిమాత్రమైన మేనున్నవాడు 
తేజస్సు ఆవరించినవాడు 
వెలుగులు నిండియున్నవాడు 
ద్యుతిధరుడై యుండినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
759)
సర్వశస్త్ర భృతావరః -

శస్త్రధారులలో శ్రేష్ఠమైనవాడు 

సర్వాయుధములు గలిగినవాడు 
యుద్ధవీరుని రూపంలోనివాడు 
సర్వశస్త్ర భృతిగలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
760)ప్రగ్రహః -

ఇంద్రియములు జయించువాడు 
అనుగ్రహపగ్గాలతో కట్టువాడు 
భుజబలముతో ఆపువాడు 
బంధించగలిగినట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు