జ్ఞాపకశక్తి నిద్ర యంత్రాంగం ఒకటే!! డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా
 జ్ఞాపకశక్తి నిద్ర యంత్రాంగం ఒకటే ననీ మనకు తెలిస్తే ఆశ్చర్యపోతాం. మెదడులోని కణాలలో సమాచార సేకరణ వితరణ నిక్షిప్తం కేవలం నాడీ కణాలలో అంటే కొత్త కొత్త నాడీ కణాలతో కనెక్షన్లు ఏర్పడి అదే మార్గం గుండా కణాలలోని విద్యుత్ శక్తి వినియోగించబడి ఆనాడీకణాల కనెక్షన్ మార్గాల గుండా ప్రవహించడాన్ని మనం జ్ఞాపకశక్తి అంటున్నాం.
అంటే నాడీ కణాల్లో విద్యుత్ ప్రవాహం వలన ఏర్పడ్డ విద్యుత్ మార్గాలు శాశ్వతమైనవీ. ఆ నాడీ కణాల్లోని విద్యుత్ మార్గాలు ఎంతవరకు ఏర్పడి ఉంటే అంతవరకు తిరిగి ఆ నాడీ కణాల్లోని విద్యుత్తు తిరిగి తిరిగి ప్రవహిస్తుందో అప్పుడు నిక్షిప్తమైన సమాచారం విద్యుత్ మార్గాల గుండా తిరిగి గుర్తొస్తుంది. ఇది జ్ఞాపకశక్తి యంత్రాంగం.
సరిగ్గా ఇలాగే నిద్ర యంత్రాంగం కూడా ఉంటుందని గ్రహించాలి. అంటే హైపోతలామస్ లోని నాడీ కణాలలో కొత్త కొత్త కనెక్షన్లు ఇంతకుముందే ఏర్పడి ఉంటాయని గ్రహించాలి. ఎంతవరకు నిద్రకు సంబంధించిన నాడీ కణాలు విద్యుత్ ప్రవాహాల వలన కనెక్షన్లను ఏర్పాటు చేసుకుంటూ పోయి ఉంటాయో ఆ విద్యుత్ మార్గాలే నిద్రపోక్రమించేందుకు నిర్దేశించబడి ఉంటాయి.
ఎంతవరకు విద్యుత్ మార్గాలు ఏర్పడి ఉంటే అంతవరకు తిరిగి తిరిగి ప్రవహిస్తుందో అప్పుడు నిద్రకు ఉపక్రమిస్తామని అర్థం. అంతకుముందే నాడీ కణాల్లో ఏర్పడ్డ విద్యుత్ మార్గాలు ఉంటేనే ఆ మార్గాల గుండా తిరిగినాడి కణాల విద్యుత్తు ప్రవహిస్తే నిద్ర వస్తుంది, లేకుంటే నిద్ర రాదని గ్రహించాలి.
మెదడులోని ముఖ్యమైన ప్రక్రియలు అయిన జ్ఞాపకశక్తి నిద్ర యంత్రాంగాలేక మిగతా అన్ని ప్రక్రియలు అంటే కలలు ఊహాశక్తి అనుకరణ మొదలగు మెదడుకు సంబంధించిన ప్రక్రియలు అన్ని ఇలాగే ఉంటాయని అర్థమవుతుంది.
శరీరకణాల్లో నాడీ కణాల్లో విద్యుత్ ఉత్పత్తి విద్యుత్ శక్తి వినియోగం విద్యుత్ మార్గాలే మేధాశక్తికి శరీర నియంత్రణ యంత్రాంగానికి మూలం అని గ్రహించాలి.
ఈ వ్యాసం ఐ ఐ సి టి డైరెక్టర్ చీప్ సైంటిస్ట్ డాక్టర్ నాగయ్య గారికి అంకితం.
Part-2
డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు