అహల్య గౌతములు! అచ్యుతుని రాజ్యశ్రీ
 రామాయణం లో అద్భుత మునిదంపతులు అహల్య గౌతములు.వీరి కుమార్తె అంజనాదేవి.ఆమె కొడుకు మన హనుమంతుడు పిల్లలకి ప్రియతమ దేవుడు.అంటే ఆంజనేయ స్వామి అమ్మమ్మ తాతయ్య ఆముని దంపతులు.అలాగే శతానందుడు వారి కుమారుడు.మా అమ్మ గొప్ప త్యాగశీలి అని తల్లిని గూర్చి రాముని తో చెప్పాడు.విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని మిథిలానగరంకి బైలుదేరాడు. దారిలో గౌతమమహర్షి ఆశ్రమం కన్పడింది.అహల్య రాయిరూపంలో లేదు.తపస్సులో మునిగి దుమ్ము ధూళి పేరుకుపోయిన పవిత్ర మాత.రాముని శరీరంపై నుంచి వచ్చే పవిత్ర గాలితో నీవు పునీతురాలివి అవుతావు.అప్పటిదాకా ఇలాగే ఉండు అని గౌతమమహర్షి తాను వేరే ప్రాంతానికి వెళ్లి పోయి తపస్సు లో మునిగాడు.ఆయన తపస్సు భంగం కలిగించే శక్తి ఇంద్రుడికి లేదు.అందుకే అహల్యతో రమించాడు. అపూర్వ సౌందర్య రాశి అహల్య పెళ్లి కాకముందు ఇంద్రుని చూసి మనసు పోగొట్టుకున్నది.అవివాహిత ఆడపిల్ల పెళ్ళి ఐన తర్వాత భర్తను తప్ప వేరే పరాయి వాడిని తలచరాదు అని  వాల్మీకి మహర్షి ఉపదేశం.గౌతమునివేషంలో వచ్చిన ఇంద్రుని శపించాడు "నావేషంలో తెల్లార్తూనే వచ్చి నాభార్య తో ఉన్నావు.నీపురుషత్వం పోతుంది.నీఅండాలు పడిపోతాయి". అందుకే ఇంద్రుడికి మేషం అంటే గొర్రె వృషణాలు అతికించారు.అందుకే అతనికి మేషవృషణుడు అని పేరు వచ్చింది.ఈకథంతా విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు.పతితపావనుడు రాముని రాకతో దోషాలు తొలగిపోతాయి అని గౌతముడికి తెలుసు.అహల్యను చూస్తూనే పూజ్య భావంతో రాముడు ఆమె పాదాలకి నమస్కారం పెట్టాడు.అప్పుడే గౌతముడు వచ్చి తన భార్యను కుటీరంలోకి తీసుకుని పోయాడు. ఇక్కడ గౌతమమహర్షి ఔన్నత్యం తేటతెల్లమైంది.భార్యతప్పు చేస్తే భర్త ప్రశాంతంగా విని సమస్యలు పరిష్కరించాలని వాల్మీకి చెప్పారు.అందుకే కేవలం వాయుభక్షణంతో నీమనసు బుద్ధిని మంచి మార్గం లో కి మళ్లించు" అని అహల్యకు మార్గనిర్దేశం చేశారు.తప్పు దిద్దుకుని పశ్చాత్తాపంతో బతకటమే మనిషి లక్ష్యం కావాలి అని చెప్పారు. తెలిసీ తప్పు చేసిన అహల్య దాన్ని సరిదిద్దుకుంది.ఇది బాలకాండ లో వాల్మీకి ఇచ్చిన ఉపదేశం 🌸

కామెంట్‌లు