చదువులతోట;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఎంతచక్కటిదోయి ఈ చదువులతోట
ఎంతపరిమళమోయి ఈతోటచదువులు
ఈ చదువులమ్మ ఒడిలోన ఎన్నికళలో
ఎన్నికలలతో ఈకళలను ఔపోసనపట్టాలో
ధనిక,పేద,కుల,మత, లింగ 
వివక్షలు లేని బృందావనమిది
ఈ ప్రాంగణంలోకి అడుగిడుతూనే
జ్ఞాన, విజ్ఞాన ముద్రాంకితులవుతుంటారు
క్షాత్రులంతా మునులవోలె ఈ తోటలో
నిరంతర జ్ఞానధ్యానంతో గడుపుతారు
అనితరసాధ్యమైన విజ్ఞానమంతా
కరతలామలకం చేసుకుంటారు
ఉస్మానియా విశ్వవిద్యాలయమంటే
మేధావులను తయారుచేసే కార్ఖానా
దేశాలేకాదు ఖండాంతరాలఖ్యాతిగాంచింది
ఇక్కడి చదువులంటే ఒక బ్రాండ్
ఇక్కడి విద్యార్థులంటే ఒక బ్రాండెడ్ మేధావులు
అందుకే వీరు విశ్వవిఖ్యాతులైనారు
ఇక్కడి గురువులెప్పుడూ క్షాత్రప్రియులే
విద్యార్థులకోసం అహర్నిశలు ఆనందంగాశ్రమిస్తారు
తమంతవారిగా వారిని తీర్చిదిద్దుతారు
"మణియేనవలయం,వలయేనమణిః"లాగా
గతవందేళ్ళుగా విశ్వంలో భాసిస్తున్నారిద్దరూ!!
***********************************

కామెంట్‌లు