:గురువులు చెప్పిన మాట చదన్నం మూట. ;-ఎండీ. రియాజ్ 10వ తరగతి జి. ప. ఉ. పాఠశాల.నీర్మాల
 అనగనగ గారెపల్లి అనే ఊర్లో ఒక ఐదుగురు స్నేహితులు ఉండేవారు అందులో కొందరు పేద కుటుంబం వారు. వాళ్లు నాలుగవ తరగతి నుండి కలిసి మెలిసి ఉండేవారు. వాళ్లు రోజు వాళ్ళ ఊరి సర్కారు బడికి వెళ్ళేవాళ్ళు. ఆ బడిలో కూడా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక ఆరవ తరగతికి వచ్చాక ఐదుగురిలో ముగ్గురు చిల్లరగా తయారయ్యారు అంత చెడు అలవాట్లుకి బానిసలయ్యారు మిగత ఇద్దరు చాలా బాగా చదువుతారు అలాగే మంచి పనులు చేస్తారు. ఆ ముగ్గురుకి ఈ ఇద్దరు వద్దురా అలాంటి పనులు అని చెప్పిన వినకుండ ఏ ఏంకాదు తీరా అని యి ఇద్దర్ని అనే వాళ్లు. ఏడో తరగతిలో వాళ్లు సిగరేట్లు కూడా మొదలు పెట్టారు ఆ ముగ్గురు. పాపం ఆ ఇద్దరు ఎంత వద్దు అని చెప్పిన వినకుండ వీళ్ళని తిట్టేవారు. కానీ వీళ్ళు మేము తాగము అని అనేవారు కాదు. ఇంకా ఆ ముగ్గురకి టీచర్స్ చెప్పిన మాటలు కూడా వినేవారు కాదు. ఇంకా టీచర్లనే బాధపెట్టేవారు.టీచర్లు అప్పుడప్పుడు వీళ్ళు చేసే పనులకు కోపం తెచ్చుకొని తిట్టకుండా ఉండేవారు. ఆ ఇద్దరు వాళ్లకు ఇలా చెప్తారు అరేయ్ మీది చాలా పేద కుటుంబంర మాలాగా చదివి ఉండండ్రా ని జీవితాన్ని నీ కుటుంబం నీ ఆగం చేస్తున్నావ్. అప్పుడు ఆ ముగ్గురు ఇలా అనేవారు ఏ ఏంట్రా మీరు ఏమైనా ఐనప్పుడు చూద్దాం అని అనేవారు. ఆ ఇద్దరికి అప్పటి నుంచి ఏ వీళ్ళు మారారు అని అర్థం చేసుకొని ఇక వాళ్ళతో స్నేహం కొంచం తగ్గించారు. ఆ ముగ్గురు ఈ ఇద్దరు కలిసి ఒకరోజు దావత్ చేద్దాం అని ప్లాన్ కూడా వేసేవారు, ఆ ముగ్గురు ఏమో వ్యసనం తాగేవారు, ఆ ఇద్దరు థంప్స్అప్ తెచ్చుకొని ఇంకా తినేవి తెచ్చుకునేవారు. ఒక రోజు వీళ్ళ దావత్లో జరుపుకున్న విషయం ఇంట్లో తెలవగానే ఆ ఇద్దరు భయపడ్డారు. కానీ ఆ ముగ్గురు ఏమైంది ఎవడెం అంటాడు అని అంటారు. ఆ ఐదుగురు 9వ తరగతికి వచ్చేసరికి ఇంకా చెడ్డగా పనులు కూడా నేర్చుకున్నరు ఆ ముగ్గురు. ఇక ఆ ఇద్దరు చాలా బాగా చదువులో బాగా ముందుకు సాగారు, ఇక పోతుండగా పోతుండగా 10 వ తరగతి ఎగ్జామ్స్ రాస్తారు. అందులో ఇద్దరు చాలా బాగా రాసి మంచి మార్కులు తెచుకుంటారు. ఇక ఆ ముగ్గురు ఫెయిల్ అవుతారు. ఒక రోజు వీళ్ళు ఐదుగురు బడికి వెళ్తే వాళ్ళ సార్ అంటాడు ఎరా మీరు ముగ్గురు ఎందుకు ఫెయిల్ ayyaru వీళ్ళు ఇద్దరు బాగా రాసి పాస్ అయ్యారు అంటాడు. ఇక కొన్ని రోజల తరువాత ఆ ఇద్దరు చాలా మంచి ధనవంతులు అవుతారు కానీ ఆ ముగ్గురు ఆడుక్కుతింటారు.

నీతి : మంచి గురువులు చెప్పే మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే చెడ్డ అలవాట్లకు బానిస అవుతే పెద్దయ్యాక అనేక కష్టాలు పడాల్సి వస్తుంది
.
కామెంట్‌లు