ప్రపంచ రక్త దాన దినోత్సవం (జూన్ 14)-సిహెచ్.ప్రతాప్
 రక్తదానం అంటే ప్రాణదానం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తాన్ని అందించి అతని ప్రాణాన్ని నిలపడమే రక్తదానం గొప్పతనం. ప్రతి ఏటా జూన్ 14న ప్రపంచ రక్త దాన దినోత్సవం నిర్వహిస్తారు.  ఏబీఓ బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనిపెట్టిన శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత కార్ల్ లాండ్స్టీనర్ జయంతిని రక్తదాతలకు కృతజ్ఞతా పండగగా జరుపుకొంటున్నాయి.  రక్తదానం చేయడం వల్ల ఎదుటివారి ప్రాణాన్ని కాపాడటమే కాదు, తమకు సొంతంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. రక్తదానం చేయడం వల్ల రక్తంలో ఉన్న అదనపు ఇనుము స్థాయిలను తగ్గించుకోవచ్చు. రక్తంలో ఐరన్ శాతం పెరిగితే హిమోక్రోమాటోసిస్ వంటి సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.రక్త దానం చేయడం వల్ల పాత రక్తం బయటకు పోయి, కొత్త రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
ప్రపంచ వ్యాఒతంగా రక్త దానంపై గణాంకాలు ఈ కింది విధంగా వున్నాయి.
1. ప్రపంచవ్యాప్తంగా ఏటా 11.85 కోట్ల రక్త దానాలు జరుగుతున్నాయి. ఇందులో 40శాతం వాటా అధిక ఆదాయం ఉన్న దేశాలదే.
2. అల్పాదాయ దేశాల్లో 54 శాతం రక్త మార్పిడి ఐదేళ్లలోపు చిన్నారులకే జరుగుతోంది.
3. అధిక ఆదాయ దేశాల్లో 75 శాతం రక్త మార్పిడి 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు నిర్వహిస్తున్నారు.
4. అధిక ఆదాయ దేశాల్లో వెయ్యి మందికి 31.5 మంది రక్తదానం చేస్తున్నారు. ఎగువ ఆదాయ దేశాల్లో ఈ సంఖ్య 15.9, మధ్య ఆదాయ దేశాల్లో 6.8, అల్పాదాయ దేశాల్లో ఈ సంఖ్య 5.0 గా ఉంది.
5. 2013- 2018 మధ్య స్వచ్ఛందంగా రక్తం దానం చేసే వారి సంఖ్య 78 లక్షలు పెరిగింది
మన దేశంలో అయితే :
భారత్లో రక్త నిల్వల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రాలు 4.1 కోట్ల యూనిట్ల రక్త కొరతతో సతమతమవుతున్నాయి. సరఫరాతో పోలిస్తే డిమాండ్ 400 శాతం ఎక్కువగా ఉంది.దేశంలో ఏటా 6 కోట్ల సర్జరీలు, 23 కోట్ల ఆపరేషన్లు, 33.1 కోట్ల క్యాన్సర్ సంబంధిత చికిత్సలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ చాలా పెద్ద మొత్తంలో రక్తం అవసరమవుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న 135కో ట్ల మందిలో అత్యవసర పరిస్థితుల్లో ఏటా ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుందని, అ యితే రక్తదాతల నుంచి లభించేది మాత్రం సు మారు 50లక్షల యూనిట్లు మాత్రమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలో ప్రతీరోజు దాదాపు 12వేల మంది రక్త కొరతతో చనిపోతున్నారు. కొన్ని సం వత్సరాలుగా రక్తదానంపై అవగాహన కార్యక్ర మాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి స్పంద నలేక అవసరాలను తీర్చడానికి చాలడం లేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్ర చికిత్సలు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు ప డుతున్న వారికి రక్తం అధికంగా అవసరమవుతుంది. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం