నవ్వుతూ బ్రతకాలిరా !!1;-సి.హెచ్.ప్రతాప్
 1. ఈ రోజు నుండి కాస్త ప్రశాంతం గా నిద్రపోదామనుకుంటున్నాను, మిమ్మల్ని వెంటనే వచ్చి కలవచ్చునా ?” ఫోన్ లో అడిగాడు రమేష్.
“ అలాగే తప్పకుండా రండి. కానీ నేను డాక్టర్ని కాదు. లాయర్ని” ఆశ్చర్యంగా చెప్పాడు వెంకట్రావు.
“ కరక్టే నండి. నాకు అర్జంటుగా డైవోర్స్ కావాలి” అసలు సంగతి చెప్పి ఫోన్ పెట్టేసాడు రమేష్.
2.. ”అడ్డమైన జులాయి వెధవలతో స్నేహం చేయవద్దని మా నాన్నగారు చెప్పారు” గర్వంగా అన్నాడు రవి.
“ కరక్టే, అందుకే నేను నీతో ఈ రోజు నుండి స్నేహం మానెస్తున్నాను, బై, బై” అంటూ వెళ్ళిపోయాడు శ్రీను.
3. .“కవిని పెళ్ళి చేసుకోవడం తప్పయిపోయిందే !” ఏడుస్తూ అంది రాధ.
“ ఏమయ్యింది ? ఆస్తి, అంతస్తులు, మంచి ఉద్యోగం వున్నాయని అతనిని కావాలనే పెళ్ళి చేసుకున్నావు గా!” ఆశ్చర్యంగా అడిగింది రేఖ.
“ప్రతి రోజూ రాత్రి తాను రాసిన ఆ దిక్కుమాలిన కవితలను వినిపిస్తూ నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ హింసరాజు ” అసలు సంగతి చెప్పింది కవి బాధితురాలైన రాధ.
 


కామెంట్‌లు