.కూరి కూరి;-ఎ.రాజ్యశ్రీ 8985035283
చెరుకూరి_ కూరి కూరి
తెలుగు వెన్నముద్దలు తినిపించే
సాహితీ చైతన్యం తో ఇంటింటా ఈనాడు మడమతిప్పలేదు
ఏనాడు!!

నిబద్ధత నీతి నిజాయితీ తో దక్షులైన సిబ్బంది
రచయితలకు కలగలేదు ఇబ్బంది
ఖజానా లో దాగిన సాహిత్యం
చతుర విపుల బాలభారతం
తెలుగు వెలుగు ఆయన చతుర్భుజాలు
మార్గదర్శి రామోజీ ఫౌండేషన్ ఫిల్మ్ సిటీ సృష్టించిన అపరబ్రహ్మ

ఆనాడు రామోజీ లక్ష్మోజీ రామదాసు కి కల్గించిరి విముక్తి
మన రామోజీ తెలుగు సాహిత్యంకి కల్గించిరి భుక్తి

ఓతపస్వీ ! అక్షరాలపూదోటలో విహారి
రమాదేవి స్కూల్ తో భావిభారత పౌరులు

అయోధ్యలో బాలరాముడు వెలిసే
భాగ్యనగరంలో రామోజీ దుఃఖం సంద్రంలో ముంచే

ఓమహోన్నత శిఖరం ఒరిగింది
నామనసు బాధతో క్రుంగింది

... స్వస్తి...

కామెంట్‌లు