వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143
 హిందువులలో ఎవరు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన ముందు  వినాయకుని తలుచుకుంటూ శుక్లాంబరధరం  అన్న శ్లోకంతో ప్రారంభించడం సంప్రదాయం  దీని శబ్దార్థాన్ని  రెండవ అర్థం లో శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామి వారు విపులీకరించారు  శుక్లాంబర ధరo విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్తు సర్వ  విఘనో ప శాంతయే  అన్నది శ్లోకం దానిలో శుక్లాం అంటే తెల్లటిది అంటే పాలు విష్ణుం అంటే నలుపు అది డికాషన్ శశివర్ణం అంటే నలుపు తెలుపు కలిసింది అంటే కాఫీ  చతుర్భుజం అంటే నాలుగు చేతులు అంటే భార్యవి రెండు చేతులు కాఫీ ఇవ్వగానే అందుకునే భర్తవి రెండు చేతులు ఆ రెండు కలిపి నాలుగు చేతులవుతాయి ధ్యాయే అంటే తలచే తలుపులు అంటే అలా కాఫీ ఇవ్వడాన్ని మనసులో తలవగానే ప్రసన్నవదనం ముఖం వికసిస్తుంది ఆ సమయంలో సర్వ విక్రమ ప్రశాంతయే అంటే అన్ని వేదనలను పోగొట్టేది అనగా కాఫీ తాగితే వేదనలు తీరి మనసు శాంతం అవుతుంది అని అర్థంలో వారి వ్యాఖ్యానించడం   గమనార్హం.
అమ్మను నిందిస్తే వ్యాచిగ్రస్తుడగుతాడని  నాన్న పై నేరం మోపిన వాడు పిశాచిగా మారతాడని  దైవాన్ని నిందిస్తే దరిద్రుడు అవుతాడని గురువును నిందిస్తే కుల క్షయం ఆవుతుందని గరుడ పురాణంలో మన పెద్దలు రాసి ఉంచారు  ఇవాళ సమాజంలో భగవంతుడే లేడు అంటూ ప్రచారం చేసే వ్యక్తులు అనేకమంది మనకు కనిపిస్తూ ఉంటారు మరి అలాంటి వారందరికీ ఇది వర్తించినట్లయితే  కొన్ని వేల కుటుంబాలు నాశనం అయి ఉండాలి  ఆ భగవంతునితో సరి సమానంగా తులతూగ గలగిన గురువును  అనరాని మాటలతో అని వారి మనసును చీకాకు పరిచి బాధపడితే  అది నిజానికి తన వంశానికి శాపంగా పరిగణిస్తుంది  నీకు అక్షరాలు నేర్పిన గురువుని దూషించడం వల్ల  మీ అజ్ఞానం బయటపడుతుంది  జీవితంలో కృతఘనులు     ఎలా ఉంటారా అనిపిస్తుంది.
మంచికి మంచి చేయలేకపోయినా చెడు చేయకుండా ఉంటే చాలు అనేది  వేద వాక్యం దానిని అనుసరిస్తున్న వాళ్ళు  ఎంతమంది ఈ సమాజంలో ఉన్నారు  ఇతరుల సహాయ సహకారాలను పొంది  వారిని  చెడ్డ వారిగా చిత్రించేవాళ్లే ఎక్కువగా సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు  నిజంగా భగవంతునికి గురువుకి శాపాలు ఇచ్చే అధికారం ఉండి  కూడా నన్ను శపించడం లేదు అంటే అది వారి అసమర్థత అనుకోవాలా  మూర్తిభవించిన మంచితనానికి  ఉదాహరణగా చెప్పుకోవాలో ఆలోచించండి  నీలో ఉన్న ప్రతి కణం  నీ తల్లి నుంచి వచ్చినది తొమ్మిది నెలల నుండి శరీరాన్ని  గర్భంలో దాల్చి  ప్రాణానికి కూడా తెగించి నిన్ను ఈ భూమి మీదకు తీసుకు వచ్చిన తల్లిని దూషించిన వాడివి  మనిషివేనా.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం