వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143
 మాటరాని నీకు మాట నేర్పి  ఉన్నత స్థితికి వెళ్లి నాకు  నా  వంశానికి పేరు తీసుకువస్తాడని  అనుక్షణం తన కౌగిలిలో  అన్ని సౌకర్యాలు ఇస్తూ వాడిని సమాజంలో ఒక వ్యక్తిగా నిలబెడితే  దేశానికి రాష్ట్రానికి సేవ చేయకపోవచ్చు సమర్థతలేని కారణం కూడా దానికి  దోహదపడుతుంది  కానీ అలాంటి కన్నతల్లిని అనాథ ఆశ్రమాల పాలు చేస్తున్నావే అక్కడ నీ తల్లిని వారు ఎలా చూస్తారో నీకు ఏమైనా  ఆలోచన ఉన్నదా  ఒక్కసారి అక్కడ పరిస్థితులను గమనించినట్లయితే  నీకు ఈ పాడు బుద్ధి రాదు  నీ చిటికెన వేలి తో నడిపించుకుంటూ వెళ్లిన తండ్రి  తనను మించి ఈ రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచానికే విలువైన సేవలు చేయాలని కలలు కన్నా  ఆ ముదుసలి కి నీవిస్తున్న కానుక ఏమిటి.
అమ్మానాన్నలను  కారు చీకటిలో ఉంచి  వారు సజీవులా నిర్జీవులని కూడా చూడకుండా  ఇతర దేశాలలో ధనార్జన ధ్యేయంగా జీవిస్తున్నావు అది నీకు స్వదేశంగా అనిపించిందా అక్కడే శాశ్వతంగా ఉండాలని ఉన్నదా  బయటకు వచ్చిన తర్వాత సొంత గ్రామానికి ఒక్కసారి కూడా వెళ్ళని నీవు ఆ గ్రామ వాసులకు బయటి  వాడివి కాదా  పొరపాటు గా నీవు వెలితె ఏ ఒక్కరైనా గుర్తించగలరా  నీవు చేసిన ఒక్క మంచి పనిని గురించి వారు ఒక్క మంచి మాట చెప్పగలిగే స్థితిలో ఉన్నారా  నిన్ను నీ గురించి  నీవే ఆలోచించుకో  కలిసి ఉండి ఆత్మీయతలను పంచి  తల్లిదండ్రులను సుఖసంతోషాలతో నింపవలసిన బిడ్డ  అడ్డాల రోజులలో బిడ్డగాని గడ్డాల రోజులలో న బిడ్డ అన్న సామెతలు  నిజం చేసి చూపిస్తున్నావు కదా  పోనీ దీని వల్ల  ఏమైనా ఆత్మానందం కలుగుతుందా అంటే  వారు నీ చిన్నతనంలో చేసిన పనులు జ్ఞాపకం వస్తే నిజానికి గుండె ఉంటే అది ఆగిపోదట రా.
జ్ఞానపీఠ బహుమతి పొందడం అంత సులభం కాదు  క్షణం కాని అక్షరాన్ని  అక్షరంగా తీర్చిదిద్దడం  సాహిత్య లక్షణం  ఆంధ్ర దేశంలో మేధావి వర్గానికి ఏ లోపము లేదు అన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు  ఇప్పటికే మూడు పర్యాయాలు జ్ఞానపీఠ బహుమతిని ఆంధ్రులకు తెప్పించిన ఘనులు మనవారు వారిలో మొదటి వారు విశ్వనాథ సత్యనారాయణ గారు  విశ్వం మొత్తం  మన నేతకు అర్థమయ్యే పద్ధతిలో  నాలుగు వర్ణముల  విభజన గురించి తెలియజేసిన వాడు  ఆంధ్ర దేశానికి  ప్రభుత్వ ఆస్థాన కవిగా  తమ గురువులు అధిష్టించిన పీఠాన్ని  తిరుపతి వెంకట కవుల తరువాత ఆ గౌరవాన్ని పొందింది విశ్వనాథ వారే  వారు మాట్లాడుతూ ఉన్న ప్రతి అక్షరం మనకు  ఎన్నో అర్థాలను అందజేస్తుంది.


కామెంట్‌లు