వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143
ప్రపంచానికి వాల్మీకి మహర్షి  రాసి అందించిన  సూక్తులను అర్థం చేసుకున్నట్లయితే  ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే ప్రయాణం చేయాలి అప్పుడు విజయం తప్పకుండా వస్తుంది  న్యాయబద్ధంగా జీవితాన్ని గడిపిన వాడికి ఎలాంటి  అవరోధాలు రావు  నిజానికి ధర్మానికి ఆపద ఎక్కువ అడుగడుగునా కష్టాలు  సీతమ్మ వారి కష్టాలు తెలిస్తే చాలు విషయం అర్థం అవుతుంది  అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా  ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలిగితే  చివరికి ధర్మమే గెలుస్తుంది  జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం నిన్న కలిగిన బాధను తుడుచుకుంటూ పొంగిపోకుండా  నేడు వాస్తవాన్ని గమనిస్తూ  దానిని అనుభవిస్తూ రేపటి ఆనందం కోసం దారులు వెతకాలి తప్ప  నిన్న ఏదో తప్పు జరిగిందని ఆలోచిస్తూ దానిపైనే  మనసుపెట్టి చీకాకుగా ఉన్నట్లయితే  ముందు మీ ఆరోగ్యం చెడిపోతుంది  దానిని కాపాడుకోవడానికి అయినా  ఈ నిర్ణయం తీసుకోవాలి.
జయం అంటే గెలవడం  దీనిలో ఒక్కొక్కసారి ఓడిపోవచ్చు  కానీ విజయం  అపజయానికి చోటే లేకుండా  ప్రతి దాంట్లోనూ  గెలుపును పొందటమే  తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళటం కాదు విజయవంటే  మీకు కుటుంబం ఉంది  వారి ఆనందాన్ని కూడా చూడవలసిన బాధ్యత నీకు ఉంటుంది  అంతే తప్ప ధన సేకరణ కోసం సమయాన్ని పూర్తిగా భక్షించడం వల్ల ఆ సుఖాన్ని  పొందలేవు  మనం సంపాదించిన దానిలో సంతృప్తిగా  కుటుంబ సభ్యులందరూ   తినాలి  మనకు ఉన్నదాంట్లో కొద్దిగా నయినా  అవసరమైన వారికి బాధల్లో ఉన్నవారికి ఆకలితో అలమటించే వారికి  సహకరిస్తూ  సాయం చేయడం అనేది మాత్రమే విజయానికి కొలబద్ద తప్ప  నీకోసమే  సంపాదించే నీకోసమే ఖర్చు చేసుకోవడం అనేది స్వార్థం కిందకు వస్తుంది  మనసున్న మనిషిగా ప్రవర్తించాలి అని మన పెద్దలు చెప్తారు.
మనం ఏదైనా కార్యాన్ని సాధించాలని అనుకున్నప్పుడు పట్టుదలతో దానిపై మనసుపెట్టి  నిజాయితీగా ప్రవర్తించాలి  అంతేగాని మనం గేద పాలు తీసిన తర్వాత ఆ పాలను చూసి  వెన్న వెన్న అని అడి నంత మాత్రం చేత వెన్న మన చేతికి వస్తుందా  పాలను కాచి ఆరబెట్టి తోడు వేసి పెరుగు అయిన తర్వాత దానిని చిలికితే అప్పుడు బయటపడుతుంది ఆ వెన్న  అలాగే దేవుడా దేవుడా అని అడిగిన అంత మాత్రం చేత దేవుడు నీ ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతాడా  నీవు చేసే కార్యం తదేక దీక్షతో పంచేoద్రియాలను నీ ఆధీనంలో ఉంచుకొని  మనసు చెప్పినట్లు నీవు వినకుండా నీవు చెప్పినట్లు మనసు వినేలా  ప్రయత్నం చేసిన వాళ్ళకి తప్పకుండా భగవద్ దర్శనం కలుగుతుంది  దానికి నిదర్శనం రామకృష్ణ పరమహంస.

కామెంట్‌లు