మా మల్లన్న సచ్చిపాయ ;-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

   ఒకూర్లో ఒక రాణి వుండేది. ఆమె చానా మంచిది. ఎవరైనా బాధ పడుతా వుంటే చూసి తట్టుకునేది కాదు. ఆ రాణి దగ్గర ఒక బట్టలు వుతికే ఆమె వుండేది. ఆమె ఎప్పటికప్పుడు వూళ్ళో జరిగిన సంగతులన్నీ రాణికి పూసగుచ్చినట్టు వివరించేది. బాగా పాటలు పాడేది. ఎప్పుడూ నవ్వుతా అందరినీ నవ్విస్తా వుండేది. దాంతో ఆమె అంటే రాణికెంతో ఇష్టం. ఆమెకు కావల్సినవన్నీ ఇస్తూ ప్రేమగా చూసుకొనేది. ఆమె తన బాధలన్నీ రాణితో చెప్పుకుంటూ ఉండేది.
ఒకరోజు ఎప్పట్లాగే ఆమె బట్టలన్నీ శుభ్రంగా వుతుక్కోనొచ్చి రాణి ముందు వేసింది. రాణి బట్టలు లెక్కబెట్టుకుంటా వుంటే వెక్కి వెక్కి ఏడ్వసాగింది. అది చూసి రాణి "అయ్యో పాపం! మా చాకలామెకు ఎంత కష్టమొచ్చిందో ఏమో. ఎప్పుడూ ఏడ్చనిది ఈరోజు ఏడుస్తా వుంది" అనుకోని “ఏమే! ఎందుకట్లా ఏడుస్తా వున్నావు?” అనడిగింది. దానికా చాకలామె ఏడుస్తానే "ఏం చెప్పమంటావమ్మా! నిన్ననే మా మల్లన్న సచ్చిపోయినాడు. అది గుర్తుకొచ్చి ఏడుస్తా వున్నా" అనింది. చాకలామె బాధ చూసి రాణికి కూడా బాధేసింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. మల్లన్నంటే ఆమెకు ఎంత కావాల్సినోడో ఏమో అనుకోని రాణి కూడా ఏడ్చడం మొదలుపెట్టింది.
రాణి ఏడుస్తా వుంటే చూసిన రాజు “అయ్యోపాపం! నా రాణికి ఎంత కష్టమొచ్చిందో ఏమో... ఎప్పుడూ ఏడ్చనిది ఈరోజు ఏడుస్తావుంది' అనుకోని రాజు కూడా ఏడ్చసాగినాడు.
రాజు ఏడుస్తా వుంటే చూసిన మంత్రులు, సేనాధిపతులు "అయ్యో పాపం! మా రాజుకు ఎంత కష్టమొచ్చిందో ఏమో... ఎప్పుడూ ఏడ్చనిది ఈరోజు ఏడుస్తా వున్నాడు'' అనుకోని వాళ్ళు కూడా ఏడ్చసాగినారు.
మంత్రులు, సేనాధిపతులు ఏడుస్తా వుంటే చూసిన భటులు, దాసీలు “అయ్యో పాపం! మా మంత్రులకు, సేనాధిపతులకు ఎంత కష్టమొచ్చిందో ఏమో, ఎప్పుడూ ఏడ్చనిది ఈరోజు ఏడుస్తా వున్నారు" అనుకోని వాళ్ళు కూడా ఏడవసాగినారు. భటులు, దాసీలు ఏడుస్తా వుంటే చూసిన జనాలు “అయ్యో పాపం! మా భటులకు, దాసీలకు ఎంత కష్టమొచ్చిందో ఏమో... ఎప్పుడూ ఏడ్చనిది ఈరోజు ఏడుస్తా వున్నారు' అనుకోని వాళ్ళు కూడా ఏడవసాగినారు.
అట్లా రాజ్యంలో ఏ వీధి చూసినా, ఏ ఇండ్లు చూసినా ఏడుపులే ఏడుపులు. ఒకరిని చూసి మరొకరు కిందా మీదా పడి ఏడవసాగినారు. ఆ సమయంలో పక్క వూరి నుండి ఒక వ్యాపారి సరుకులు అమ్ముదామని ఆ రాజ్యానికొచ్చినాడు. చూస్తే ఇంగేముంది. పూరువూరంతా ఏడుస్తా వున్నారు. వాడు ఆశ్చర్యపోయి "ఇదేందబ్బా.... అందరూ ఇట్లా ఏడుస్తా వున్నారు" అనుకోని ఒకని దగ్గరకు పోయి "ఏం జరిగింది? ఎందుకట్లా ఏడుస్తా వున్నావు" అనడిగినాడు. దానికి వాడు “ఏమోబ్బా, నాకూ తెలీదు. మా భటులు, దాసీలు ఏడుస్తా వుంటే నేనూ ఏడుస్తా వున్నా" అన్నాడు. వాడు భటులు, దాసీల దగ్గరకు పోయి "ఏం జరిగింది? ఎందుకట్లా ఏడుస్తా వున్నారు" అనడిగినాడు. దానికి వాళ్ళు “ఏమోబ్బా మాకూ తెలీదు. మా మంత్రులూ,
సేనాధిపతులూ ఏడుస్తా వుంటే మేమూ ఏడుస్తా వున్నాం" అన్నారు.
వాడు మంత్రులు, సేనాధిపతుల దగ్గరికి పోయి "ఏం జరిగింది? ఎందుకట్లా ఏడుస్తా వున్నారు"
అనడిగినాడు. దానికి వాళ్ళు “ఏమోబ్బా మాకూ తెలీదు. మారాజు ఏడుస్తా వుంటే మేమూ ఏడుస్తా వున్నాం" అన్నారు.
వాడు రాజు దగ్గరికి పోయి "ఏం జరిగింది? ఎందుకట్లా ఏడుస్తా వున్నావు మహారాజా?" అనడిగినాడు. దానికి రాజు "ఏమోబ్బా, నాకూ తెలీదు. మా రాణి ఏడుస్తా వుంటే నేనూ ఏడుస్తా వున్నా" అన్నాడు.
వాడు రాణి దగ్గరకు పోయి "ఏం జరిగింది. మహారాజా? ఎందుకట్లా ఏడుస్తా వున్నావు?" అనడిగినాడు. దానికి రాణి “ఏమోబ్బా, నాకూ తెలీదు. మా చాకలామె ఏడుస్తా వుంటే నేనూ ఏడుస్తా వున్నా" అనింది.
వాడు చాకలామె దగ్గరకు పోయి “ఏం జరిగింది? ఎందుకట్లా ఏడుస్తా వున్నావు?" అనడిగినాడు. దానికి చాకలామె ముక్కు చీదుకుంటా 'మా మల్లన్న సచ్చిపోయినాడు. అందుకే ఏడుస్తా వున్నా" అనింది. మల్లన్నంటే ఎవరో అర్ధంగాక వాడు చాకలామెను ''మల్లన్నంటే ఎవరు'' అనడిగినాడు.
దానికా చాకలామె వెక్కి వెక్కి ఏడుస్తా "మల్లన్నంటే కూడా తెలీదా, చిన్నప్పన్నుండీ నేనెంతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచుకున్న మా గాడిద” అనింది.
అది విని వాడు “ఓరినీ! గాడిద చచ్చిపోయినందుకు ఇంత మంది పనీపాటా మానేసి ఏడుస్తా వున్నారా " అనుకోని కిందా మీదా పడి నవ్వుకుంటా వెళ్ళిపోయినాడు. విషయం తెలిసిన రాణి, రాజు, మంత్రులు, సేనాధిపతులు, భటులు, దాసీలు, ప్రజలు అందరూ సిగ్గుతో తల దించు కొన్నారు.
**********
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం