ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 వేదం ఒక వాక్యం చెప్పింది అంటే అది శాసనం  సత్యం  వద , ధర్మం చర  లాంటి అతి చిన్న  వాక్యాలలో కూడా జీవిత సత్యాలను అనుసరించవలసిన పద్ధతులను మనకు వేద విదులు తెలియజేశారు  సత్యమునే మాట్లాడగలను అని వ్రతం తీసుకున్న వ్యక్తి  కొన్ని సందర్భాలలో  కొన్ని ఆపదలను ఎదుర్కోవాల్సి వస్తుంది  ఒక్కొక్కసారి ప్రాణానికే భయం ఏర్పడుతుంది  అందుకే ఆ వాక్యాన్ని నిర్మించిన  ఋషి పుంగవులు  ప్రాణమాన భయము లందు  బోంక వచ్చు అని  మరీ శాస్త్రీయంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కన్నా లౌక్యాన్ని ఉపయోగించడం  మానవ ధర్మంగా వారు మనకు తెలియజేశారు అలాగే ధర్మాన్ని గురించి  అన్ని సందర్భాలలో ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగించడం కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు
నా ఆత్మీయ మిత్రులు కొంతమంది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు  నీవు అనేక కేంద్రాలలో పనిచేసే వచ్చావు అందరి పనితనం తెలుసు  అన్ని చోట్ల ఉన్న వనరులన్నీ నీకు కరతలామలకం  ప్రతి కేంద్రంలోనూ అక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలోనూ నీ భాగస్వామ్యం ఉంటుందని మాకు తెలుసు  సమస్యల సరిచేయడం నీ  అలవాటు  ఎన్నో వనరులు ఉన్న  కేంద్రాల కన్నా ఈ కేంద్రంలో ఏ వనరు  లేదు కదా  అయినా దీని మీదే ప్రేమ పెంచుకున్నావు ఎందుకు అనేది వారి ప్రశ్న  నిజం  ఈ మాట    భారతదేశంలో ఉన్న అన్ని  కేంద్రాలకు ప్రధాన వ్యక్తి ఢిల్లీలో  బిజీగా ఉంటారు  వారన్న మాట  ఏ వనరులు లేని మీ విజయవాడ కేంద్రం ఇంత గొప్ప విజయాన్ని సాధించింది అంటే  నాకెంతో గర్వంగా ఉంది అని  అది అక్షర సత్యం.ఎవరికైనా మాతృమూర్తి పైన మాతృ సంస్థ పైన  ప్రేమ ఉన్న వాడే వాడికి తెలిసిన తెలియకపోయినా  నా జీవితాన్ని పోషించింది పోషిస్తుంది కూడా   నా కేంద్రం  అందుకు జీవితాంతం నేను కృతజ్ఞుణ్ణి  అయితే అభిమానంతో కూడిన ప్రేమను ఎందుకు పెంచుకున్నారు అంటే మొదటి కారణం  అక్షరం విలువ తెలిసిన నిష్ణాతులు  ఒక్క విజయవాడ కేంద్రానికి పరిమితం  మీరు ఏ ప్రొడ్యూసర్ని తీసుకున్న నాటక శాఖలో బంధా గారిని కానీ  సాహిత్యం లో డాక్టర్ జీవీ కృష్ణ రావు గారిని కానివ్వండి  విద్యార్థుల కార్యక్రమాల్లో డీఈవోగా  ఉద్యోగం చేసి వచ్చి వారికి కావలసిన అన్ని విషయాలను చెప్పించే కందుకూరి రామ భద్ర రావు గారు  ప్రజల నోళ్ళలోనానే ఉషశ్రీ గారు  అలా ప్రతి ఒక్కరూ  ప్రాణం పెట్టి పనిచేసిన వారే.


కామెంట్‌లు