బీదరికాన్ని దాని తత్వాన్ని నిర్ణయించే మేధావులు ఎవరు ఎవరిని నిర్ణయిస్తారు అని ఆలోచించినప్పుడు అన్ని విధాల సంతోషంగా ఉండే మనిషి సరైన ధనవంతుడు అని నిర్ణయిస్తారు అన్ని విధాలా అంటే ఏ పద్ధతిలో దానిని గురించి ఆలోచించినప్పుడు మనిషి అంటేనే ఆశాజీవి ఇది చేయడం వల్ల అది లభిస్తుంది కనుక అది చేద్దాం అని ఆలోచనలో మునిగి పోతాడు అలాంటివాళ్లు అత్యాశకు కానీ దురాశకు కానీ వెళ్ళరాదు తన శక్తి సామర్ధ్యాలు తెలిసి ఏది చేయగలడో దానిని ఎంచుకోవాలి సామాన్యంగా ఎదుటివారు మనకన్నా గొప్పగా సంపాదిస్తున్నారు అంటే ఒక నిజమైన ఈర్ష్య అసూయ మనలో కలగడం సహజం దీనికి కారణం ఏమిటి.కనక తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తి అతి త్వరలో తనను మించిన ధనికుడు కావడం సహించలేని వ్యక్తులలో అసూయ కలగడం సహజం దాని వెనుక ఉన్న కృషి అర్థం చేసుకున్నట్లయితే ఈ అసూయకు అంతం తెలుస్తుంది అలాగే కొంతమంది ఆన రాని మాటలతో దూషిస్తూ మాట్లాడుతున్న పెద్దలను చూస్తూ ఉంటాం ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఒక్కొక్కసారి అతడికే తెలియదు ఉద్వేగంలో మాట్లాడే మాటలు ఆ క్షణంలో మర్చిపోతాం అదే ఉద్రేకంలో మాట్లాడిన మాటలు చాలాకాలం జ్ఞాపకం ఉండి దానినే తిరిగి తిరిగి చెప్పడం అందరకు తెలిసిన విషయమే ఈ నాలుగు విషయాలను అర్థం చేసుకొని దాని వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహించినట్లయితే ఈ ప్రశాంతతగా నివసించే వ్యక్తి ధనవంతునిగా కీర్తించబడతాడు అంతే తప్ప వేరు కారణం లేదు అని పెద్దలు చెప్తారు.ఏ మనిషి అయినా సమాజంలో గౌరవంగా జీవించాలని ఎదుటివారితో కలిసి ఎలా జీవించాలో ఏది తనకు ఆత్మ తృప్తి కలిగిస్తుందో దానిని చేయాలి ధనవంతుడు సమాజంలో గౌరవాన్ని పొందుతాడు అని అనుకోవడం అది నిజం కాదు ఎవరికి వివేకం ఎక్కువగా ఉందో వారు ఎక్కువ ధనవంతుడిగా పేరు పొందుతారు అలాగే తనను కాచి రక్షించే వస్తువులు కత్తి పిస్టల్ లాంటివి ఉన్నాయన్న గర్వం కొంతమందికి ఉంటుంది కానీ క్షమను మించిన పదునైన ఆయుధం మరొకటి లేదు అని గమనించరు నిజానికి తనను కాచి రక్షించేది తన నమ్మకం తను చేస్తున్న పని సరి అయినది సమాజంలో గౌరవ మర్యాదలను తెచ్చిపెట్టేదే అన్న నమ్మకంతో చేసిన వాడిని సమాజం గౌరవిస్తుంది ఏదైనా మనకు రుగ్మత కలిగినప్పుడు మందులు సేవించడం అలవాటు వాటికి దూరంగా ఉండాలంటే అనుక్షణం హాయిగా ఆనందంగా నవ్వుతూ జీవించడం ప్రధానం దీనివల్ల ఏ వైద్యుని వద్దకు వెళ్ళవలసిన అవసరం ఉండదు.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి