ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322.
 నేను తప్పు చదివితే అబ్బాయి అది ఆయన పదం  ఊత పదం  గాడి తప్పుతున్న బండిని పట్టాలు మీద సక్రమంగా వెళుతుంది లేదా బండి బోల్తాపడుతుంది అనేవారు తప్పు ఇలా చెప్తే బాగుంటుంది ఇది ఇలాగే చెప్పు అని ఎప్పుడూ చెప్పేవారు కాదు అలాంటి వారి దగ్గర పని చేయటం గొప్ప అదృష్టంగా భావిస్తాను రామరాజు నాటకం మే 14వ తేదీన  కాపయ్య సేనాని అని 18వ తేదీ కామేశ్వరరావు గారి జయభేరి 24వ తేదీన ప్రసారమైన ఓలేటి కృష్ణ గారు రచించిన ధన్య జీవి కథలు 21వ తేదీన చదివాను బందా గారు హాస్య ప్రోక్తముగా ఆంతర్య యంత్రం రచించి తాను కూడా నటించి 24వ తేదీన ప్రసాదం చేశారు జూన్ 2వ తేదీన రాగరాగిణి నాకు మంచి అవకాశం.
రేడియో కేంద్రంలో డ్యూటీ ఆఫీసరు గా పనిచేసిన గొల్లపూడి మారుతీ రావు రచించిన  నాటకాన్ని కే వెంకటేశ్వరావు  సండూరి కబీర్దాస్ అన్నపరెడ్డి శివరామరెడ్డి అనేక పర్యాయాలు వేదికపై ప్రదర్శించారు  ఆ నాటకం రేడియోలో ప్రసారం కావాలని  నండూరి విట్టల్ గారి కోరిక జూలై రెండవ తేదీన రేడియో కళాకారులతో రికార్డు చేశారు నాకు రజిని వేషo ఇచ్చారు శ్రీ రంగం గోపాల్ రత్నం శ్రీరామ్మోహన్రావు నండూరి సుబ్బారావు శ్రీధర్ నాగరత్నమ్మ కుటుంబరావు మిగిలిన పాత్రలు పోషించారు  ఈ నాటక విన్న కే వెంకటేశ్వరావు గారు మేం ప్రదర్శించిన దానికన్నా అందంగా చక్కగా రేడియోలో వినిపించారు అని విటల్ గారిని ప్రశంసించారు అనువదించిన మరో మంచి నాటకం దేవి చౌదరిని హిందీలో బంకించంద్ర రచించారు ఈ నాటకంలో నాతో పాటు వింజమూరు లక్ష్మి నటించడం విశేషం.పురాణ ప్రవచనాలను ప్రజలకు అందించిన ఉషశ్రీ గారు  శ్రోతలకు ప్రయోక్తగానే తెలుసు కొంతమందికి రేడియో నాటకాలు ద్వారా రంగస్థలం కొద్దిమందికి మాత్రమే తెలుసు కోనేరు రాజబాబు గారు నిర్మాతగా బాధ్యులు ఎవరు డాక్యుమెంటరీ సినిమా తీస్తున్నప్పుడు నేను కూడా నిర్మాణ రంగంలో ఉన్నాను ఆ సందర్భంలో గురువుగారిని ఒప్పించి అందులో వేషం కూడా వేయించాను అలా ఆకాశవాణి రంగస్థలంతో పాటు బుల్లితెర డాక్యుమెంట్స్ లో కూడా ప్రఖ్యాతిగాంచారు  అలాంటి నిష్ణాతులైన  మేధావులతో నటించడం వల్ల  వ్యక్తిగతంగా ఆకాశవాణిలో నాకు పేరు రావడమే కాకుండా  అక్షరజ్ఞానం పెరిగింది  ఏ పదాల్ని ఎక్కడ అందంగా వాడాలో  అనేకమంది రచనలను  చదవడం వల్ల మేధను పెంచుకోవడంలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి  అలా జీవితంలో ఆకాశవాణికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి


కామెంట్‌లు