ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 బీదరికాన్ని ధనికత్వాన్ని  నిర్ణయించే మేధావులు ఎవరు ఎవరని నిర్ణయిస్తారు అని ఆలోచించినప్పుడు  అన్ని విధాల సంతోషంగా ఉండే మనిషి సరైన ధనవంతుడు అని  నిర్ణయిస్తారు  అన్ని విధాలా అంటే ఏ పద్ధతిలో  దానిని గురించి ఆలోచించినప్పుడు  మనిషి అంటేనే ఆశాజీవి  ఇది చేయడం వల్ల అది లభిస్తుంది కనుక అది చేద్దాం అని ఆలోచనలో మునిగి పోతాడు  అలాంటివాళ్లు అత్యాశకు కానీ దురాశకు కానీ వెళ్ళరాదు తన శక్తి సామర్ధ్యాలు తెలిసి ఏది చేయగలడో దానిని ఎంచుకోవాలి  సామాన్యంగా ఎదుటివారు మనలాగా గొప్పగా సంపాదిస్తున్నారు అంటే ఒక నిజమైన ఈర్ష్య  అసూయ మనలో కలగడం సహజం  దీనికి కారణం ఏమిటి.కనక తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తి అతి త్వరలో  తనను మించిన ధనికుడు కావడం  సహించలేని వ్యక్తులలో  అసూయ కనపడటo సహజం  దాని వెనుక ఉన్న  కృషి అర్థం చేసుకున్నట్లయితే ఈ అసూయకు  అంతం తెలుస్తుంది  అలాగే కొంతమంది అనరాని మాటలతో  దూషిస్తూ మాట్లాడుతున్న పెద్దలను చూస్తూ ఉంటాం ఎందుకు అలా చేస్తున్నారు అనేది  ఒక్కొక్కసారి అతడికే తెలియదు  ఉద్వేగంలో మాట్లాడే మాటలు  ఆ క్షణంలో మర్చిపోతాం  అదే ఉద్రేకంలో మాట్లాడిన మాటలు  చాలాకాలం జ్ఞాపకం ఉండి దానినే తిరిగి తిరిగి చెప్పడం  అందరికీ తెలిసిన విషయమే  ఈ నాలుగు విషయాలను  అర్థం చేసుకొని దాని వెనుక ఉన్న పరమార్థం గ్రహించినట్లయితే  ఈ ప్రశాంతతగా  నివసించే వ్యక్తి  ధనవంతునిగా  కీర్తించబడతాడు  అంతే తప్ప  వేరు కారణం లేదు అని పెద్దలు చెప్తారు.ఏ మనిషి అయినా సమాజంలో  గౌరవంగా జీవించాలని  ఎదుటివారితో కలిసి ఎలా జీవించాలో ఏది తనకు ఆత్మ తృప్తి కలిగిస్తుందో దానిని చేయాలి  ధనవంతుడు సమాజంలో గౌరవాన్ని పొందుతాడు అని అనుకోవడం అది  నిజం కాదు  ఎవరికి వివేకం ఎక్కువగా ఉందో వారు  ఎక్కువ ధనవంతుడిగా  పేరు పొందుతారు  అలాగే తనను కాచి రక్షించే వస్తువులు  కత్తి పిస్టల్ లాంటివి  ఉన్నాయన్న ప్రేమ కొంతమందికి ఉంటుంది  కానీ క్షమను  మించిన  పదునైన ఆయుధం మరొకటి లేదు అని గమనించరు  నిజానికి తనను కాచి రక్షించేది తన నమ్మకం  తను చేస్తున్న పని  సరి అయినది సమాజంలో గౌరవ మర్యాదలను తెచ్చిపెట్టేదే అన్న నమ్మకంతో చేసిన వాడిని  సమాజం గౌరవిస్తుంది  ఏదైనా మనకు రుగ్మత కలిగినప్పుడు మందులు సేవించడం అలవాటు  వాటికి దూరంగా ఉండాలంటే  అనుక్షణం హాయిగా ఆనందంగా నవ్వుతూ జీవించడం  ప్రధానం  దీనివల్ల ఏ వైద్యుని వద్దకు వెళ్ళవలసిన అవసరం  ఉండదు.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం