ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 విజయవాడ కేంద్రంలో  ఈరోజు యువ వాణి అన్న పేరుతో  సాయంత్రం   ప్రసారమవుతున్న కార్యక్రమం మొదట యువ భారతి  దానిని మూడు సంస్థలు నిర్వహిస్తూ ఉండేది  ఆ తర్వాత యువవాణి గా దానిని మార్చి  దానికి ప్రత్యేకంగా ఒక  అధికారిని నియమించి  వారి ద్వారా కార్యక్రమాలను నిర్వహింపచేస్తోంది  ఆకాశవాణి విజయవాడ కేంద్రం  యువతరం అదే మొదటిసారి ఆకాశవాణి కేంద్రాన్ని చూడడం. వచ్చి అక్కడ ఏం చేయాలి మైక్ దగ్గర ఎలా మాట్లాడాలి ఏ విషయాన్ని గురించి వారు మాట్లాడుకోవాలి  ప్రసంగం అయితే ఒక పద్ధతి చర్చ గాని గోస్టీగాని అయితే మరొక పద్ధతి  కదంబ కార్యక్రమాలు ఎలా చేయాలి? దానిలో ఏ ఏ అంశాలు ఉంటాయి  ఇవేవీ తెలియకుండా  కేంద్రం  మెట్లు ఎక్కుతారు యువత.వచ్చిన యువతకు అక్కడ ఏం జరుగుతుంది ఏం చేయాలి అన్న విషయాలు ఏమాత్రం తెలియదు  ముందు వారి కంఠం ఆకాశవాణికి  సరిపోతుందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆడిషన్   పెట్టి కొన్ని ఐటమ్స్ ని చదివిస్టారు దానిలో సరిగా ఉంటే  అంటే అక్షరాలు సరిగా పాలకటo భావాన్ని   వ్యక్తీకరించడం ముఖ్యం అలా ఉన్నవారిని ఎన్నిక చేసి వాడు చేయవలసిన పనులను వారికి చెప్పి  అరగంట కార్యక్రమం ఎలా చేయాలి  దానిలో ఎలాంటి అంశాలు ఉండాలి  అన్న విషయాలన్నీ ముందు వాడికి అవగాహన వచ్చేట్టుగా చెప్తారు  మా కేంద్ర సంచాలకులు ఎవరు కొత్తవారు వచ్చినా వాడిని నా వద్దకు పంపించే సంప్రదాయం  ఉంది  ఎక్కువగా బాలికలు వస్తూ ఉంటారు  బాలురు చాలా తక్కువ.ఆ వచ్చిన వారిలో  కొంతమందిని ఎన్నిక చేసి  అసలు యువకులకు నిర్దేశించిన కార్యక్రమంలో  యువకులకు కాక  మరి ఎవరికి సంబంధించిన విషయాలు చెప్పాలి  కార్యక్రమంలో చెప్పేవారు  దానిలో భాగస్వాములు  యువత అయి ఉండాలి  30 నిమిషాల కాలవ్యవధిలో  నాలుగు లేక ఐదు కార్యక్రమాలు ఉండేట్టుగా చూసుకోవాలి  దానిలో భాగస్వాములు అందరూ కూడా యువత అయి ఉండాలి  యువకులకు సంబంధించిన విషయాలు తప్ప ఆ కార్యక్రమాల్లో మరి దేనిని గురించి మాట్లాడకూడదు  రచన గాని చదవడం కానీ వారు సొంతగా చేయాలి  ముందు ఈ నియమాలన్నిటినీ నేర్చుకుంటే  తర్వాత మీరు మాట్లాడడానికి మైక్ ముందుకు వెళ్ళినప్పుడు ఆ మైక్ ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయం తెలియాలి.
----------------------------------------------
సమన్వయం ; డా. నీలం స్వాతి 


కామెంట్‌లు