విమల సాహితీ ;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
పల్లవి:
ఒక్కొక్కరూ ---దూరమవుతుంటే---
మన వంతూ--- దగ్గరవుతుంటే---
మూడునాళ్ళ ముచ్చట బ్రతుకు ముగిసిపోతే---
అదే కదా మరణం---2
చరణం 1
నాదీనాదన్నది
నీదికాదులేరా--2
 నమ్మినోడినే
నిండా ముంచే దుష్టులున్నరూ2
మిగుల సంపద పోగేసి 
వెంటతీసుకెళ్తావా--
ఏది రాదురా--
నీదంటూ ఏది లేదురా--2
చరణం 2
/ఒక్కొక్కరూ/
ఆశ మనిషికి ఇంధనమే--
పదిమందిని దోచుట
ప్రమోదమా---2
రక్తపుకూడుకు మరగకు---
శ్రమజీవుల ఊసురుతీయకూ---2
/ఒక్కొక్కరూ/
చరణం 3
వస్తుప్రేమలకు అలవాటుపడి
వ్యక్తులను ఈసడించకూ---2
అన్యాయపు సొమ్మే
తగనిరోగమై తనువుచాలిస్తావూ--2-
చరణం 4
/ఒక్కొక్కరూ/
ఉన్నది పంచు--- పుణ్య సంపద పెంచు---2
మిగుల ధనమంతా-- నీది కానేకాదు--2
పరుల సొమ్మది --
పాములాంటిది2
/ఒక్కొక్కరూ/కామెంట్‌లు