సహజమైన ఎరువులు;- మూగ అక్షయ తొమ్మిదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనపూర్మెదక్ జిల్లా చరవాణి: 9959730286
    అనగనగా రామాపురం అనే గ్రామంలో రంగయ్య, సాంబయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రంగయ్య పేడ, చెట్ల కొమ్మలు వంటి పదార్థాలతో  సహజంగా ఎరువులు తయారుచేసి, పంటలు పండించేవాడు. ఇలా కృత్రిమంగా ఎరువులు తయారు చేయడం మూలంగా ఖర్చు కూడా అయ్యేది కాదు. రంగయ్య అలా పంటలు పండించడం ప్రజలందరికీ నచ్చింది. ప్రజలు కూడా రంగయ్య లాగానే స్వయంగా ఎరువులు తయారు చేసుకుని వ్యవసాయం చేసేవారు. ఒక్కో సందర్భంలో పంట తక్కువ వచ్చినా, కృత్రిమ ఎరువులు వాడామని సంతోషపడేవారు. ఆరోగ్యంగా జీవించసాగారు.
           కానీ సాంబయ్య మాత్రం రసాయనిక ఎరువులు వాడుతూ పంటలు పండించేవాడు. రసాయనిక ఎరువుల మూలంగా సూక్ష్మజీవులు చనిపోయి, పంటకు బలం ఉండదని, పంట ఎక్కువ పండిన ఆ పంట వలన నష్టం ఉంటుందని రామయ్య చాలా సార్లు సాంబయ్యకు చెప్పాడు. అయినా సాంబయ్య రసాయనిక ఎరువుల ద్వారానే వ్యవసాయం చేస్తుండేవాడు. 
             కొద్దిరోజుల తర్వాత సాంబయ్య పండించిన పంటలో రసాయనక ఎరువులు ఉండడం మూలంగా ఇంట్లో కుటుంబ సభ్యులు కాస్త అనారోగ్యానికి గురైనారు. అప్పుడు సాంబయ్య తన తప్పును తెలుసుకున్నాడు. తిరిగి రామయ్య చెప్పినట్లుగా సహజంగా తయారు చేసిన ఎరువులను వాడి వ్యవసాయం చేసి పంటలు పండించసాగాడు. రంగయ్య సంతోషించాడు. గ్రామస్తులందరూ కూడా రంగయ్య బాటలో నడిచి వ్యవసాయం చేయసాగారు.
నీతి: ఫలితం తక్కువైనా, పదిమందికి ప్రయోజనం కలగాలి. 

కామెంట్‌లు