మంచిది;- -గద్వాల సోమన్న,9966414580
గుండెలోని భారం
దించుకుంటే మంచిది
చెడు అలవాట్లు దూరం
చేసుకుంటే మంచిది

మనసులోని మలినం
శుద్ధి అయితే మంచిది
మంచి వారితో పయనం
సాగిపోతే మంచిది

సజ్జనులతో బంధం
కట్టబడితే మంచిది
సుగుణాల సుగంధం
గుబాళిస్తే మంచిది

చిన్ననాటి స్నేహం
గుర్తుంటే మంచిది
జీవితంలో ద్రోహం
చేయకుంటే మంచిది

అక్కరలో సాయం
చేస్తేనే మంచిది
మితిమీరిన కోపం
అదుపు చేస్తే మంచిది

పొరుగువారితో కయ్యం
లేకపోతే మంచిది
అనుమానం పెనుభూతం
మానుకుంటే మంచిది


కామెంట్‌లు