అందమైన ప్రకృతి;- -గద్వాల సోమన్న,9966414580
ప్రవహించే సెలయేరులు
పలకరించే అందాలు
ప్రకృతి వర ప్రసాదాలు
మానవులతో బంధాలు

పక్షుల కోలాహలం
ఎటు చూసినా జలం
కన్నుల పండుగ చేయు
హృదయాలను ముడివేయు

నింగిని తాకే తరువులు
విహరించే పక్షులు
అతి సుందర దృశ్యాలు
కదిలే నీలి మేఘాలు

అడుగడుగునా పూవులు
పచ్చదనపు పరుపులు
పారే జలముల పరుగులు
రంజింపజేయు మనసులు

చూడు ప్రకృతి సోయగాలు
జీవకోటికి వినోదాలు
పరవశింపజేస్తాయి
ఆహ్లాదం పంచుతాయి

ప్రకృతిని పాడుచేయొద్దు
స్వార్థానికై వాడొద్దు
ప్రకృతి మాతకు  మాత్రం
ఆవేదన తేవొద్దు


కామెంట్‌లు