మట్టి కుండను నేను!;- -గద్వాల సోమన్న,9966414580
మట్టి కుండను నేను
హాని చేయగలేను
ఫ్రీజ్ కన్నా మేలు
నేను ఉండిన చాలు

చల్లగ ఉంచుతాను
చక్కగ పనిచేస్తాను
ఇంటిల్లిపాదికిల
ఉపయోగపడుతాను

అనారోగ్యం రాదు
ఆరోగ్యమే పోదు
మట్టి కుండను నేను
మీ మేలు తలచేను

వట్టి మాటలు కాదు
మాయమంత్రం లేదు
అలనాడు నేనంటే
అభిమానమెంతో!!

ఆల్కలీన్ లక్షణాలు
నాలోన పుష్కలం
ఆహారంలో ఆమ్లత
తటస్థీకరిస్తాను

ఎండలో తిరిగి తిరిగి
వచ్చి నాలోని నీరు
త్రాగితే చాలు చాలు
వడ దెబ్బ గెలిచేరు

పేదోళ్ల నేస్తాన్ని
దీవించు హస్తాన్ని
భేదం లేదు లేదు
కాదులె నేను చేదు

ఎండాకాలంలో
అక్కడక్కడ  ఉంటా!
ఇంటిలో చేరితే
చెప్పినట్లు వింటా!


కామెంట్‌లు