ఓ పక్షి అభ్యర్థన!!;- -గద్వాల సోమన్న,9966414580
పచ్చని వృక్షాలను
నరకకండి మానవా!
అవే మాకు నివాస
స్థలాలని ఎరుగవా!

చెట్లు లేక పుడమి
ఎడారిగా మారదా!
జీవకోటికి ముప్పు
వస్తుందని తెలియదా!

ఓజోన్ పొర పలుచగా
మారిందని  తెలుసుకో!
తరువులను విరివిగా
పెంచుడం నేర్చుకో!

చెట్లు లేక  ధరిత్రి
అగ్నిగుండమాయెను
వర్షాలే కురియక
పచ్చదనం పోయెను

నిలువ నీడ కోల్పోయి
మా పక్షి జాతి ఎద
బాదుకుంటుందోయి!
మా వృద్ధి లేదోయి!

మేముంటే మేలోయ్!
ఇక కళ్ళు తెరుచుకో!
మొక్కలు నాటండోయ్!
మీ మేలు మరవమోయ్!


కామెంట్‌లు