పర్యావరణ దినోత్సవ వేడుకలలో కవి అయ్యలసోమయాజుల కవితాగానం
 విశాఖపట్నంలో  స్థానిక ప్రిజమ్ కళాశాలలో  సహృదయ సాహితీ సంస్థ  ఆధ్వర్యంలో  ఘనంగా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలలో భాగంగా విశిష్ట అతిథిగా స్వచ్చా భారత్ అంబాసిడర్ విశాఖ పూర్వ ఉపకులపతి ఆచార్య  వి.బాలమోహన్ దాస్ పాల్గొన్నారు. సంస్థ వ్యవస్థాపకులు కవి, సాహితీ వేత్త శేఖరమంత్రి ప్రభాకర్ ,రంగస్థల నటుడు, కవి డాక్టర్ కె. జి.వేణు, ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య దామెర వెంకట సూర్యారావు పాల్గొన్న సాహితీ సభలో కవి, రచయిత సాహిత్యరత్న అయ్యలసోమయాజుల ప్రసాద్, రసాయన శాస్త్ర విశ్రాంత శాఖాధిపతి ,విశాఖపట్నం పర్యావరణ పరిరక్షణ గురించి"నీ వినాశనానికి నీవే హేతువు"అన్న కవితాగానం చేసి 'వృక్షో రక్షతి రక్షితః 'అన్నది ప్రతివాని బాధ్యత నేటి భూతాపానికి, అనేక భయానక పరిస్థితులకు మానవుడు విచక్షణా రహితంగా పంచభూతాలను నాశనం చేయడమే అని చెప్పారు
సరస్వతీ సభలో కవులు పిళ్ళా రమణమూర్తి భాగవతుల సత్యనారాయణ, అప్పలరాజు, రామతాత, భీమేశ్వరరావు,రాధారాణి, సురేఖ, డాక్టర్ వాణి మరియు గౌరవ అతిధి విజయనిర్మాణ్ అధినేత డాక్టర్ విజయకుమార్ గారు పాల్గొన్నారు. సభా నిర్వహణ డాక్టర్ కే.జి వేణుగారి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది.

కామెంట్‌లు