ఎస్సీ కాలనీ విద్యార్థిని ప్రతిభ

  కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని చెప్యాల రాజకుమారి క్రీడా పాఠశాల ప్రవేశం కోసం మండల స్థాయిలో నిర్వహించిన పోటీలో  అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయింది. మండల విద్యాశాఖాధికారి టి. సురేందర్ కుమార్, ఎంఎన్ఓ సిరిమల్ల మహేష్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం నరెడ్ల సునీత ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పీఈటీలు కుమారస్వామి, దుర్గాప్రసాద్, ఈర్ల నరేష్, నజీమ్ లు ఏడు రకాల ఆటల పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీల్లో ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని చెప్యాల రాజకుమారి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన రాజకుమారిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్లసమ్మయ్య, ఉపాధ్యాయినులు విజయలక్ష్మి, సమత, భారతి లు అభినందించారు. ఈ సందర్భంగా ఈర్లసమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పిల్లలు  చదువుతోపాటు ఆటపాటల్లో రాణిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు డబ్బులు వృధా చేసుకోకుండా సకల సౌకర్యాలతో పాటు ఉచిత నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చేర్పించాలని ఈర్ల సమ్మయ్య తల్లిదండ్రులను కోరారు.
కామెంట్‌లు