ఎడారి దారుల్లో ఎదురయే
పూలవనంలా
తడారిపోయిన గొంతుకు
తగిలిన గంగలా
పొడారిపోయిన మనసున
నాటిన చినుకులా
సడులేవీ చేయకనే జరిగిన
విస్ఫోటనంలా
లోయల నడుమ జరిగిన
చీకటి యుధ్ధంలో
విజేతగా వచ్చి నిలచిన
వెలుగుల వీరుడు...
తూరుపు నుదుటను
దిద్దిన కుంకుమ తిలకపు
కాంతులు ఇలను చేరేలా మోసుకువచ్చు కిరణంలా
పరచిన పరిసరాలన్నీ
పసిడిగా తోచే ప్రభలతో
పరుగులు పెట్టేలా తరిమిన
తిమిరపు జాడలు కరిగేలా
పుడమికి పరవశం తెచ్చిన
పుత్తడి మిసమిసల మెరుపులా
మనసును కట్టిన సంకోచాల
సంకెల తెంచుకు ఎగిరి
స్వేఛ్ఛా సుగంధాల పరిమళం
ఆస్వాదిస్తూ ఆనందించే
మది పొందే అనుభూతుల
అరవిందాల ప్రకాశంలా
అంతర్యామి అవనిపై
కురిపించే అనుగ్రహపు
ధారల తడిసిన అణువణువూ
చైతన్యం సంతరించుకుని
ప్రతి మదినీ మందిరంలా
ప్రతి మనిషీ మాధవుడిలా
ప్రతినిత్యం ప్రవర్తించే
ప్రత్యేకమైన వరమిచ్చే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి