సుప్రహత కవిత ; -బృంద
గుండె గుడి చేసి వేచిన
మది ముంగిలి
ఎద సడిలోని నిశ్శబ్దపు
చైతన్యపు సవ్వడి
కనురెప్పలు దాచిన కమ్మని
స్వప్నాల సాకారం
మనసున  కమ్మిన కలతల
కరిగించే  సాయం

జీవితనావను తీరం చేర్చే
నమ్మకపు తోడు
కళ్ళు చూసే కమ్మని
సత్యమైన స్వర్గం
ఊహల పరుగులకు 
ఊతమిచ్చే నిజం
కాలం చేసిన గాయాలను
మరిపించే మాయ

ఎదలోయలో నిదురించే
మమతల మేలుకొలుపు...
ఆర్తిగ చేసే వినతుల
ఆలకించే వేలుపు
వెచ్చగ తాకి నేనున్నానని
ఓదార్చే వేకువ
వెన్నెలంటి వెలుగులతో
వెతలు తీర్చే కొత్తమలుపు

చేతులు జోడించి నిలిచి
రెప్పవేయక నీకై వేచి
మాటకు అందని భావాలు
చేసే అలజడులే మంత్రాలుగా
మనసు నిండిన భక్తి
వెలిగించిన దివ్వెగా
కంట చిమ్మిన నీట అభిషేకిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు