ఇనుపస్థంభం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఈరోజుల్లో ఇనుపవస్తువు నీరు తగిలి తే చాలు తుప్పు పట్టి విరిగిపోతుంది.కానీ ఢిల్లీ సమీపంలో ఉన్న మెహ్రౌలీలో ఇనుపస్థంభందాదాపు  1700 ఏళ్ళు కావొస్తున్నా గాలివానలో తడుస్తూ ఎండిపోతూ ఎంచక్కా తుప్పు పట్టకుండా నేలవ్రాలకుండా అలాగే ఇప్పుడు కూడా ఉంది అంటే అద్భుతంకదూ!?  7మీటర్ల ఎత్తు ఉన్న 6 టన్నుల బరువైన ఆఇనపస్థంభం పై మచ్చలు గీతలు తుప్పు లేనే లేవు.అసలు సిసలు ఇనుముతో పాటు ఐరన్ ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసిన  మిసమైట్ అనే మిశ్రమపు పూత ఇన్ని శతాబ్దాలుగా దాన్ని కాపాడుతోందని  ప్రపంచ శాస్త్ర సాంకేతిక నిపుణుల అభిప్రాయం. మరి ఆరోజుల్లో అవినీతి అక్రమాలు లేకుండా రాజు పనివారు ఉన్నారు కాబట్టే ఆ అద్భుత సంపదనిలిచింది.మరి నేడు మనం చూస్తూ ఉన్నాం కదా? ఇవాళ చేసిన రోడ్డు మరమ్మతులు వర్షాకాలంలో గాలిలో పేలపిండి.ఆహారం కూరలు పానీయాలు కల్తీ .గల్లంతు శాల్తీలు. నీతినిజా యితీ గా ధర్మం గా మనిషి లేకపోతే ప్రకృతి కూడా తిరగబడ్తుంది అని మన పురాణాలు రామాయణం భారతాలు చెప్తున్నాయి.కనీసం మనం ప్రవచనాలు విని పిల్లల కి పెద్దలు అమ్మ నాన్న లు  అధ్యాపకులు చెప్తూంటే అవినీతి అక్రమాలు అన్యాయాలు గూర్చి తెలుసు కుని పిల్లలు సకారాత్మకంగా ఆలోచించి ప్రవర్తిస్తారు కదూ!?🌷
కామెంట్‌లు