ముక్తికి మార్గం ;సి.హెచ్.ప్రతాప్
 మానవుడు తన మనస్సులో మెదిలే మనోభావాల తోనే పుణ్యపాపాలు లెక్కిస్తాడు. . అసలు పుణ్యపా పాల గరించి భావన లేని వాడికి ఆ పుణ్యపాపాల ప్రసక్తే ఉండదు. సదా శ్రద్ధతో పరమాత్మను భావన చేసేవారి కి నివృతి మార్గం ముక్తికి దారిచూపు తుంది అని శాస్త్రం చెబుతోంది.
మనం విరామకాలం అంతా భగవచ్చింతనలో గడపటానికి అలవాటు పడాలి. దానికి ఎన్నో మార్గాలు శాస్త్రం సూచించింది.నామ జపం, సత్సంగం,సత్కధా శ్రవణం, ధ్యానం, పూజాదికాలలో నిమగ్నమై ఎప్పుడూ భగవచ్చింతనలోనే గడపటానికి ఏదో ఒకమార్గాన్ని అన్వేషించాలి. పాపాచరణ జ్ఞానేంద్రియాలతో కానీ, కర్మేంద్రియాలతో కానీ జరగకుండా జాగ్రత్తపడాలి.దుష్టచింతనలు లేక స్వచ్చమైన మనస్సుతో, పవిత్రమైన హృదయంతో జీవించి తుదకు ముక్తి పొందడానికి   భక్తియే మార్గం. మనస్సు భక్తితో నిండిపోతే ఆ నిర్మల హృదయంలో భగవంతుడు నివసించడానికి అవకాశముంటుంది.మనం ఎప్పుడూ సత్యాన్వేషణ, ముక్తి మార్గంలో ఉండడమే ఈ దేశ విశిష్ఠత. ముక్తే పరమోన్నత లక్ష్యం.

న్యాయంగా ధర్మంగా సంపాదించిన ధనంతో దైవకార్యాలు, సమాజశ్రేయస్సుకు పనికివచ్చే కార్యాలు నా పరంగా నా కోసం చెయ్యి. ఒక్కమాటలోచెప్పాలంటే నిష్కామ కర్మ, ఇతరులకు ఉపయోగపడే కర్మలు, పరమాత్మపరంగా చెయ్యాలి. ఆ ఫలితాలను పరమాత్మకు అర్పించి, తరువాత వాటిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి , అదే ముక్తికి మార్గం.
ముక్తి మార్గంలో ఎలాంటి ఆచారాలు లేవు. ఆచారాలు లౌకిక జీవితంలో మాత్రమే ఉంటాయి. ఇది భౌతిక మరియు భౌతిక సుఖాలను కోరుకునే వారి కోసం. కర్మలు చేయడం ద్వారా, మనం సాపేక్ష ప్రాపంచిక ఆనందాన్ని భౌతిక ప్రపంచంలోని సుఖాలను పొందుతారు. అయితే, మనం ఈ తాత్కాలిక ప్రాపంచిక ఆనందాన్ని కోరుకోకుండా, శాశ్వతమైన ఆనందం కోసం ఆరాటపడినట్లయితే , మోక్షమార్గం  సుళువుగా తెరుచుకుంటుంది.
కాబట్టి ఈ జన్మలోన్వ్ తక్షణం ఒక సద్గురువును ఆశ్రయించి సాధన చేసి సదాచారాలుగా జీవించి ఉత్తమ కర్మలను ఆచరించి, సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలను నిర్మూలించుకొని కర్మరాహిత్యాన్ని పొంది ఈ జన్మలోనే మరొక జన్మలేని జన్మరాహిత్యాన్ని పొంది ఆ భగవంతుడిలో ఐక్యమై ముక్తిని, మోక్షాన్ని పొందుతూ,  ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవడానికి తక్షణమే మనం నడుం బిగించాలి. 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం