సుప్రభాత కవిత ; -బృంద
ఎదురు చూసి అలసిన
మనసున కదిలే  నిరాశ
క్షణక్షణమూ పెరిగే ఆ వేదన
ఆగక సాగే ఱంపపు కోతే!

అంతకంతకూ పెరిగే
హృదయ భారం ఎంతైనా
కన్నుల  కట్ట దాటని
చెమ్మల  కట్టుబాటు..

వసంతం కోసం వేచి వాడిన
కొమ్మకు కన్నీరే మిగిల్చే
కాలమెంత కర్కశమైనదో
మూలాన్నే మాడ్చేయగలదు

హృదయాలను ఊరడించేలా
అనుకోని అనుగ్రహాలు ఏవో
వెదుకుతూ దరిచేరి దారిచూపే
ఉదయాలెపుడూ ఉంటాయి

సమస్యల వలలో చిక్కి
స్థాణువైన  మదికి ...చిన్న
చేయూత నిచ్చి కాపాడి
చిగురులు కొత్తగ కనిపించేలా

వరమేదో ఇమ్మని వేడుతూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు