డా. అరుణ కోదాటి "అరుణతోరణాలు " కవితా సంపుటి ఆవిష్కరణ

  డా. అరుణ కోదాటి  రాసిన "అరుణతోరణాలు " అనే కవితా సంపుటి  దిలీషుక్ నగర్ లోని   షిరిడి సంస్థాన్ వారి సాయిబాబా ఆలయం లో మంగళ వారం , సాయి నాధుని సన్నిధిలో  పండితుల వేద మంత్రోచ్చారాణాల నడుమ  అరుణ భర్త గారైన కోదాటి ప్రదీప్  తో కలిసి   పుస్తక ఆవిష్కరణ చేసారు. పండితులఅశీర్వాదం తో  ముగిసింది.
ఈ "అరుణ తోరణాలు " కవితా సంపుటిని  అరుణ అమ్మా,నాన్నలు అయిన అక్కిరాజు నర్సింగారావు 
(A.N. రావు ), రాంబాయమ్మ గార్లకు ప్రేమ పూర్వకంగా అంకితం చేసారు.
తనకు సాయి ఇస్టదైవము, సర్వవేళలా కాపాడే దైవంఅని, 
 నాన్నతో కలిసి  చిన్నప్పుడే న్యూస్ పేపర్ చదవడం,రాజకీయాల గురించి, తెలుసుకునేదని, సమాజంలో తనకంటూ  ఒక గుర్తింపు  తెచ్చుకోవడానికి  కారణం, ఉన్నత ఉద్యోగిగా, కుటుంబ బాధ్యతగా, ఒక యూనియన్  నాయకుడి గా అటు కార్మికులకు, ఇటు  స్వంతగ్రామం అయిన కలుకోవ ( సూర్యాపేట జిల్లా ) లో   ఊరికి అనేక సేవలు చేస్తూ, ఒక ఆదర్శంగా  నిలిచిన తన  నాన్నే  నాకు ఆదర్శం అంటుంది. 
గృహిణిగా అమ్మనుండి ఓపిక, సహనంతో  కుటుంబాన్ని, బంధువులను, పిల్లలను ఎలాచూ సుకోవాలో అమ్మనుండే నేర్చుకున్నాను. అంటుంది.
ఇక వివాహమయ్యాక  తన ఆదర్షా లు, అభిప్రాయాలూ కలిసిన  మేన బావ అయిన భర్తే  తనకు, చదువులో, ఉద్యోగంలో సాహిత్యములో, రాజకీయంలోఇలా అన్ని రంగాల్లో  తనకు ప్రోత్సాహాన్ని , ఇస్తూ సమాజంలో ఎలా ఉన్నతంగా  ఎదగాలో వివరిస్తూ తనని  ప్రోత్సహిస్తారని చెప్పారు. 
తమ్ముడు దుర్గాప్రసాద్, కవితల గృహంలో  బంధువుల మధ్య ఆనందంగా జరుపుకున్నానని రచయిత్రి  డా. అరుణ కోదాటి  తెలిపారు. తనకు అభినందనలు తెలిపిన సాహిత్య వేత్తలకు, కవుల/కవయిత్రుల కు, రచయితలు / రచయిత్రులందరికి ధన్యవాదాలు తెలిపారు.
కామెంట్‌లు